Ads
ఆస్ట్రేలియా టీంఇండియా పై విజయం సాధించి, ఆరోసారి వరల్డ్ కప్‌ను సొంతం చేసుకుంది. అయితే ఈ విజయంతో క్రికెట్ చరిత్రలోనే తొలిసారి అరుదైన ఘటన చోటు చేసుకుంది. ఇది క్రికెట్ ప్రపంచాన్ని మాత్రమే కాకుండా ఫ్యాన్స్ ను ఆశ్చర్యపడేలా చేసింది.
వరల్డ్ కప్ 2023 గెలిచిన ఆస్ట్రేలియా టీమ్ లో మిచెల్ మార్ష్ ఒకరు. అయితే అతని తండ్రి కూడా క్రికెటర్, ఆయన 1987 వరల్డ్ కప్ టోర్నీలో ఆస్ట్రేలియాకు ఆడాడు. ఆ టోర్నీలో ఆసీస్ విజేతగా నిలిచింది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
ప్రపంచ కప్ గెలిచిన తరువాత ఆ జట్టు ప్లేయర్ మిచెల్ మార్ష్ తన తండ్రి, లెజెండరీ బ్యాటర్ జియోఫ్ మార్ష్‌తో కప్ పట్టుకున్న ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ టోర్నీలో మిచెల్ మార్ష్ 10 మ్యాచ్‌లలో 107 కన్నా ఎక్కువ స్ట్రైక్ రేట్‌తో 441 రన్స్ చేశాడు. టోర్నమెంట్‌లో 177 అత్యుత్తమ స్కోరు, 2 సెంచరీలు, ఒక అర్ధ సెంచరీ చేశాడు. టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన లిస్ట్ లో పదవ స్కోరర్‌గా నిలిచాడు. అంతేకాకుండా 2 వికెట్లు తీశాడు.
అయితే మార్ష్ తండ్రి మరియు ఆస్ట్రేలియా లెజెండరీ బ్యాటర్ జియోఫ్ మార్ష్ 1987 ప్రపంచ కప్ లో ఆడాడు. ప్రపంచ కప్ అందుకున్న జట్టులో మెంబర్ గా ఉన్నాడు. అప్పుడే ఆస్ట్రేలియా మొదటిసారిగా ప్రపంచ కప్ సాధించింది. ఇద్దరు పూర్తిగా భిన్నమైన ఆటగాళ్లు అయినప్పటికీ, 1987 మార్ష్ ప్రపంచ కప్ మరియు 2023 మార్ష్ ప్రపంచ కప్ మధ్య పోలికలు అద్భుతమైనవి.
Ads
ఇద్దరూ భారతదేశంలో అన్‌ఫ్యాన్సీడ్ అండర్ డాగ్స్‌గా టైటిల్‌ను గెలుచుకున్నారు. ఇద్దరూ రెండు సెంచరీలు సాధించారు. ఇద్దరూ ఆస్ట్రేలియా యొక్క రెండవ అత్యధిక స్కోరర్‌గా నిలిచారు. జియోఫ్ 428 పరుగులతో, మిచ్ 441 పరుగులతో ముగించారు. వరల్డ్ కప్ చరిత్రలో తండ్రీ కొడుకులు ప్రపంచ కప్ సాధించన జట్లలో ఉండడం ఇదే మొదటిసారి. జియోఫ్ మార్ష్, మిచెల్ మార్ష్ వరల్డ్ కప్ చరిత్రలో వన్డే ప్రపంచ కప్ గెలిచిన తొలి తండ్రీ కొడుకులుగా సరికొత్త రికార్డ్ సృష్టించారు.
Also Read: అప్పుడు గంగూలీ చేసిన తప్పే.. ఇప్పుడు రోహిత్ చేశాడా..?