ట్యూబ్ లెస్ టైర్ పంక్చర్ రిపేర్ పేరుతో ఇంత మోసం జరుగుతుందా.? అలాంటి చోట్ల జాగ్రత్త.!

Ads

మామూలుగా మనం రోడ్డుపై వెళ్తున్నప్పుడు అనుకోకుండా మన కార్ లేదా బైక్ టైర్ పంచర్ అవ్వడం జరగడం అన్నది కామన్. అటువంటి సమయంలో దగ్గర్లో ఉన్న పంక్చర్ షాప్ దగ్గరికి వెళ్లి ఆపుతాము. ఇది చాలామంది పంక్చర్ షాప్ వాళ్లు తెలివిగా మోసం చేస్తూ ఉంటారు. అక్కడ ఏం మోసాలు జరుగుతాయి? అనుకుంటే పొరపాటు పడినట్లే. మరి పంక్చర్ షాప్ దగ్గర జరిగే మోసాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.. జనరల్ గా మనం ఇలా గాలి కొట్టించడానికి ఆగినప్పుడు వారు గాలిని చెక్ చేస్తూ మీ టైర్ పంక్చర్ అయిందని చెప్పి మీ టైర్ లో గాలిని నింపలేరు. దీనితో మీరు పంక్చర్ రిపేర్ ని కూడా వారినే చేయమని చెబుతారు.

Ads

దీనిని వారు అవకాశంగా తీసుకుని మీ టైర్ ను రిపేర్ చేయడం మొదలు పెడతారు. మొదటగా, వారు మీ టైర్ ని నీటిలో ముంచుతారు. అయితే ఈ క్రమంలో వారు మరిన్ని చోట్ల మీరు గమనించకుండా హొల్స్ చేస్తారు. ఒకవేళ రిపేర్ షాప్ లో ఇద్దరు ఉన్నట్లయితే ఒకరు రిపేర్ చేస్తుండగా మరొకరు మిమ్మల్ని మాటల్లో పెట్టేస్తారు. ఒక దానికి రిపేర్ చేయాల్సింది వారు ఐదు ఉన్నాయని మీకు చూపిస్తారు. వారు సబ్బు నీరు లేదా ENO కలిపి నీటిని వాడే అవకాశం ఉంటుంది. ఇలాంటి నీరు మీకు బుడగలను చూపిస్తుంది. దానితో మీరు టైర్ పంక్చర్ అయిందని నమ్ముతారు. ఫలితం గా ఒక పంక్చర్ కి వంద చొప్పున మీ దగ్గర నుంచి ఐదు వందల రూపాయలను వసూలు చేస్తారు.

మీరు డబ్బుని ఎక్కువ మొత్తం లో చెల్లించాల్సి వస్తుంది. అంతే కాకుండా మీ టైర్ కూడా పాడవుతుంది. ట్యూబ్ లెస్ టైర్ రిపేర్ కి కొంత ఎక్కువే వసూలు చేస్తారు. అయితే అందరూ ఇలాగే మోసం చేస్తారని కాదు కాకపోతే అటువంటి ప్రదేశాలలో జాగ్రత్తగా తెలివిగా ఉండడం మంచిది. కాబట్టి మీరు రోడ్ సైడ్ రిపేర్ చేయించే క్రమంలో అప్రమత్తంగా ఉండడం మంచిది. అలాగే దగ్గరుండి చేయించుకోవడం మంచిది.

Previous articleసెన్సార్ రివ్యూ: కోటబొమ్మాళి పీఎస్ మూవీ హిట్ పక్కానా.. అలాంటి అంచనాలను క్రియేట్ చేయనుందా?
Next article1987 లో తండ్రి…2023 లో కొడుకు…వరల్డ్ కప్ గెలిచిన ఈ తండ్రి కొడుకులు ఎవరంటే.?
Hi, This is Harika. I have been working as a web content writer in PRATHIDVANI from the past one year and am experienced in writing articles in cinema, sports, inspiring stories and flash news categories.