Ads
ప్రస్తుత రోజుల్లో స్త్రీలు హై హీల్స్ వేసుకోవడానికి బాగా అలవాటు పడిపోయారు. చిన్నపిల్లలు కూడా ఈ హై హీల్స్ వేసుకోవడానికి ఎక్కువగా ఆసక్తిని చూపిస్తూ ఉంటారు. ఫ్యాషన్ అనే పిచ్చి పేరుతో లేనిపోని అనారోగ్య సమస్యలను కొని తెచ్చుకుంటున్నారు. ఈ హై హీల్స్ వేసుకోవడం వల్ల స్థూలకాయత్వంతో పాటు కాలినొప్పిలతో ఎక్కువగా బాధపడుతున్నారు. అయితే హై హీల్స్ వేసుకున్నప్పుడు నొప్పి ఉన్న అతి పక్క వారికి తెలియకుండా ఆ నొప్పిని భరిస్తూ రాత్రి సమయంలో మాత్రం చాలా మంది ఆ నొప్పితో విలవిల్లాడుతూ ఉంటారు. దీంతో చాలామంది ఆ నొప్పిని తట్టుకోవడం కోసం పెయిన్ కిల్లర్లు ఆయింట్మెంట్లు స్ప్రేలు వాడుతూ ఉంటారు.
Ads
అయితే వాటికి బదులుగా కొన్ని చిట్కాలను పాటిస్తే చాలు ఆ సమస్య నుంచి బయటపడవచ్చు అంటున్నారు ఆరోగ్య నిపుణులు. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. మెడికల్, సర్జికల్ దుకాణాల్లో రిజిడ్ స్పోర్ట్స్ టేప్ అని ఒక టేప్ దొరుకుతుంది. ఇది తక్కువ ధరకే లభిస్తుంది. 38 ఎంఎం మందం కలిగి స్టిఫ్‌గా ఉంటుంది. ఈ టేప్‌ను తీసుకుని కాలి చూపుడు వేలికి అలాగే మధ్య వేలికి కలిపి ప్లాస్టర్‌లా వేయాలి. ఇలా రాత్రి పూట చేయాలి. ఇలా కాలి వేళ్లకు టేప్ వేసి రాత్రంతా అలాగే ఉంచి ఉదయాన్నే తీసేయాలి. తరచూ ఇలా చేయడం వల్ల కాళ్లలో వచ్చే సాధారణ నొప్పులు తగ్గిపోతాయి.
అంతేకాదు పాదాలపై ఒత్తిడి ఎక్కువగా పడకుండా ఉంటుంది. ఎక్కువ దూరం రన్నింగ్ చేసినా పాదాలపై ఒత్తిడి కలగకుండా ఉంటుంది. ఏవైనా క్రీడలు ఆడుతున్న సమయంలో ఇలా టేపింగ్ చేసుకుంటే వేళ్లపై అదనపు ఒత్తిడి పడకుండా ఉంటుంది. ఇది గాయాలు కాకుండా కూడా నిరోధిస్తుంది. అయితే టేపింగ్ చేసిన క్రమంలో వేళ్లు వాపుకు గురవడం, ఎరుపుగా మారడం, దురద రావడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే ఫిజియోథెరపీ వైద్యున్ని సంప్రదించాలి. ఈ విషయంలో మీకు ఎటువంటి సలహాలు ఉన్నా కూడా వెంటనే వైద్యున్ని సంప్రదించి వైద్యుల సలహా మేరకు అలా టేపు వేసుకోవడం మంచిది.