Ads
ప్రస్తుత రోజుల్లో థియేటర్లలో విడుదల అయిన సినిమాలు ఊహించని విధంగా నెల లేదా రెండు నెలల లోపే ఓటీటీలో ప్రత్యక్షమవుతున్న విషయం తెలిసిందే. ఎంత పెద్ద సినిమా అయినా సరే విడుదలైన కొన్ని నెలల్లోనే ఓటీటీలో ప్రత్యక్షమవ్వాల్సిందే. ఇక ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్ లాంటి పెద్ద సినిమాలు కాస్త ఆలస్యంగా అయినా కూడా కొన్ని నెలల వ్యవధి లోనే ఓటీటీలోకి విడుదలైన విషయం తెలిసిందే. కానీ ఇప్పుడు మనం తెలుసుకోబోయే ఒక మూడు సినిమాల్లో మాత్రం విడుదల కొన్ని నెలలు గడిచినా కూడా ఇంకా ఓటెటలోకి మాత్రం విడుదల కావడం లేదు. పోని ఆ సినిమాలో థియేటర్లలో డిజాస్టర్ గా నిలిచాయి అంటే అది కూడా లేదు.
కానీ ఆ సినిమాలో మాత్రం ఓటీటీలో బాట పట్టడం లేదు. దీంతో ప్రేక్షకులు ఆ సినిమాలు ఎందుకు ఓటీటీ రావడం లేదు అని తలలు పట్టుకుంటున్నారు. ఇంతకీ ఆ మూడు సినిమాలు ఏవి ఎందుకు థియేటర్లో విడుదల కావడం లేదో ఇప్పుడు తెలుసుకుందాం.. టాలీవుడ్ అక్కినేని హీరో అఖిల్ నటించిన ఏజెంట్ సినిమా సినిమా విడుదల ఈ కొన్ని నెలలు కాబోతున్న కూడా ఇప్పటివరకు ఓటీటీలో విడుదల కాలేదు. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమా భారీ అంచనాల నడుమ విడుదల అయ్యి ఊహించని విధంగా డిజాస్టర్ గా నిలిచింది. ఈ సినిమా ఓటీటీ రైట్స్ ని సోనీ లీవ్ దక్కించుకున్న విషయం తెలిసిందే. ఆ మధ్య ఈ సినిమా ఓటిటిలోకి విడుదల కాబోతుంది కొన్ని మార్పులు చేర్పులు చేశారంటూ వార్తలు వినిపించినప్పటికీ అవన్నీ రూమర్స్ గానే మిగిలిపోయాయి.
Ads
మరి ఈ సినిమా ఎందుకు ఓటీటీలో విడుదల కావడం లేదు అన్న ప్రశ్న ఎక్కువగా వినిపిస్తోంది. అలాగే లేడీ సూపర్ స్టార్ నయనతార ప్రధాన పాత్రలో నటించిన సినిమా కనెక్ట్. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా థియేటర్లలో విడుదల అయ్యి కలెక్షన్ల వర్షం కురిపించింది. థియేటర్లలో మంచి వసూళ్లను రాబట్టిన ఈ మూవీ ఓటీటీలోకి మాత్రం విడుదల కాలేదు. అశ్విన్ శరవణన్ ఈ మూవీకి దర్శకత్వం వహించారు. ఈ సినిమా గతేడాది డిసెంబర్‌లో థియేటర్లలో విడుదలైన విషయం తెలిసిందే. ఈ సినిమా విడుదల అయ్యి ఏడాది పూర్తి కావస్తున్నా కూడా ఇంకా ఈ సినిమా ఓటీటీ లోకి విడుదల కాకపోవడం ఆశ్చర్యపోవాల్సిన విషయం.
అలాగే అదా శర్మ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ది కేరళ స్టోరీ. సుదీప్తో సేన్ ఈ మూవీకి దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. 40 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ సినిమా 300 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. ఈ మూవీ విడుదల అయ్యి నెలలు గడుస్తున్నా కూడా ఓటీటీ లో ఎందుకు విడుదల కావడం లేదు అన్నది ప్రేక్షకులకు కూడా అంతు చిక్కని ప్రశ్నగా మారిపోయింది.