Ads
మెగా ఫ్యామిలీ నుండి వచ్చిన యంగ్ హీరో వైష్ణవ్ తేజ్… మొదటి సినిమా ఉప్పెన తోనే ఇండస్ట్రీ హిట్ కొట్టారు. తర్వాత వచ్చిన సినిమాలు పెద్దగా ఆడలేదు. తాజాగా ఆదికేశవ మూవీ తో ఆడియన్స్ ముందుకు వచ్చారు. ఈ సినిమా రివ్యూ ఎలా ఉంది? హిట్టా ఫట్టా అనేది చూద్దాం….!
నటీనటులు: పంజా వైష్ణవ్ తేజ్, శ్రీ లీల, జోజు జార్జ్, సదా, సుదర్శన్, రాధికా శరత్ కుమార్, జయప్రకాశ్, తనికెళ్ళ భరణి, సుమన్, అపర్ణా దాస్ తదితరులు
ఛాయాగ్రహణం: డడ్లీ
సంగీతం: జీవీ ప్రకాష్ కుమార్
సమర్పణ: శ్రీకర స్టూడియోస్
నిర్మాణ సంస్థలు: సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్
నిర్మాతలు: సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య
రచన – దర్శకత్వం: శ్రీకాంత్ ఎన్. రెడ్డి
విడుదల తేదీ: నవంబర్ 24, 2023
కథ:
చిత్ర (శ్రీ లీల) ఓ మల్టీ నేషనల్ కంపెనీకి సీఈవో బాలు (వైష్ణవ్ తేజ్)కంపెనీకి ఉద్యోగం కోసం ఇంటర్వ్యూ కి వచ్చి ఉద్యోగానికి సెలెక్ట్ అవుతాడు. బాలు వ్యక్తిత్వం నచ్చి చిత్రకు దగ్గరవుతాడు. ఇద్దరు ప్రేమలో పడతారు.ఆ విషయం తెలిసి చిత్రకు మరొకరిని ఇచ్చి పెళ్లి చేయాలని అనుకుంటున్నట్లు ఆమె పుట్టినరోజు పార్టీలో తండ్రి అందరి ముందు చెబుతాడు. ఆ తర్వాత బాలుకు వార్నింగ్ ఇస్తుంటే.. రాయలసీమకు చెందిన ఎమ్మెల్యే మహా కాళేశ్వర్ రెడ్డి (సుమన్) అన్నయ్య (తనికెళ్ళ భరణి) అక్కడికి వస్తారు.
బాలు కోసం రాయలసీమ మనుషులు ఎందుకు వచ్చారు? వాళ్ళకు, సిటీలో ఉండే బాలుకి సంబంధం ఏమిటి? బాలును రుద్ర కాళేశ్వర్ రెడ్డి అని ఎందుకు పిలిచారు? సీమలోని చిన్న పిల్లలతో మైనింగ్ చేయించే చెంగారెడ్డి (జోజు జార్జ్)కి, బాలుకు మధ్య అసలు ఏం జరిగింది? చివరకు ఏమైంది? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి….!
రివ్యూ:
Ads
ఆదికేశవ’ ట్రైలర్ చూస్తే… ఇదొక మాస్ అండ్ కమర్షియల్ టెంప్లేట్ మూవీ అని అర్థమవుతుంది. ఆ అంచనాలను నిజం చేస్తూ ముందుకు వెళ్ళే చిత్రమిది. స్టార్టింగ్ టు ఎండింగ్… కథ, కథనం, మాటలు, దర్శకత్వంలో కొత్తదనం లేకుండా దర్శకుడు శ్రీకాంత్ రెడ్డి జాగ్రత్త పడ్డారు. ఆయన కమర్షియల్ సినిమా తీయాలని అనుకున్నారు. తీశారంతే! అంతకుముందు ఇలాంటి సినిమాలు వచ్చాయా లేదా అన్న సంగతి కూడా పట్టించుకోలేదు. దర్శకుడు బోయపాటి శ్రీను ని బాగా ఇన్స్పైర్ అయినట్టున్నాడు. ఫైట్లు కూడా దానికి తగ్గట్టుగానే ఉన్నాయి. అలాగే కొన్ని చోట్ల హీరోయిజాన్ని ఇరికించాలని ట్రై చేశాడు. ముందు నుంచి ఆడియన్స్ ని ప్రిపేర్ చేయాలని ట్రై చేశాడు.
ఇక టెక్నికల్ గా ఈ సినిమా విషయానికి వస్తే జీవి ప్రకాష్ కుమార్ పాటలు కమర్షియల్ సినిమాకి తగ్గట్టుగా ఉన్నాయి. కెమెరా వర్క్ సినిమా ఫ్లేవర్ కి తగ్గట్టు నీట్ గా ఉంది. శ్రీ లీల వైష్ణవ తేజ్ మాస్ స్టెప్స్ బాగా అలరిస్తాయి. నిర్మాణ విలువలు బాగున్నాయి.
ఇక పెర్ఫార్మన్స్ విషయానికి వస్తే వైష్ణవ్ తేజ్ మాస్ క్యారెక్టర్లు కూడా చేయగలను అని నిరూపించుకోవడానికి ట్రై చేశాడు. లవ్ సీన్లలో కూడా మంచి జాలిగా పెర్ఫామ్ చేశాడు. శ్రీ లీల కూడా క్యూట్ అండ్ లవ్లీ ఎక్స్ప్రెషన్స్ తో ఆకట్టుకుంది.డాన్సులు ఇరగదీసింది. కమెడియన్ సుదర్శన్ కామెడీ టైమింగ్ బాగుంది. మిగతా పాత్రధారులు అందరూ తమ పరిధి మేరకు నటించుకు పోయారు. విలన్ గా చేసిన జోజో జార్జ్ పాత్ర రొటీన్ గా ఉన్న కూడా ఆయన కొత్తగా కనిపించాడు.
ఫైనల్ గా చెప్పాలంటే మెగా ఫ్యామిలీ నుండి వచ్చిన వైష్ణవ్ తేజ్ కి మంచి మాస్ సినిమా పడినట్టే గానీ, రొటీన్ గా అనిపించే సినిమా అందరికీ నచ్చకపోవచ్చు. అయితే శ్రీలీల డ్యాన్సులు కామెడీని ఎంజాయ్ చేయడానికి ఒకసారి ట్రై చేయొచ్చు.
ప్లస్ పాయింట్స్:
- శ్రీ లీల వైష్ణవ్ తేజ్ కాంబో.
- కామెడీ
- లవ్ సీన్స్
మైనస్ పాయింట్స్:
- రొటీన్ కథ
- పాత సినిమాలను గుర్తు చేసే సీన్స్
రేటింగ్: 2 .5/5
చివరి మాట: మొత్తానికి ఆదికేశవ ఒక రొటీన్ కథ ఉన్న కమర్షియల్ సినిమా
ట్రైలర్: