Ads
నవంబర్ చివరి వారం కూడా పలు చిత్రాలు రిలీజ్ అయ్యాయి. థియేటర్లలో రిలీజ్ అయిన సినిమాలలో పర్ ఫ్యూమ్ మూవీ ఒకటి. ఈ చిత్రం స్మెల్ బేస్డ్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కింది. మరి ఈ మూవీ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం..
- మూవీ : పర్ ఫ్యూమ్
- నటీనటుల : చేనాగ్, ప్రాచీ థాకర్, అభినయ తదితరులు..
- దర్శకుడు : జేడీ స్వామి
- సంగీతం : అజయ్ అరసాడ
- నిర్మాత : సుధాకర్, రాజీవ్ కుమార్
- రిలీజ్ డేట్: నవంబర్ 24, 2023
స్టోరీ:
సైకో వ్యాస్ (చేనాగ్) స్మెల్ అబ్‌సెషన్ వ్యాధితో బాధపడుతుంటాడు. అతనికి అమ్మాయిల స్మెల్ తగిలిన వెంటనే అదోరకంగా ప్రవర్తిస్తుంటాడు. తరచూ అమ్మాయిలను వాసన చూస్తూ వ్యాస్ వారిని చాలా ఇబ్బంది పెడుతుంటాడు. రోజురోజుకి సిటీలో ఇలాంటి కేసులు ఎక్కువ అవుతుండడంతో వెంటనే ఆ సైకోని పట్టుకోవాలని ఏసీపి దీప్తి (అభినయ) అనుకుంటుంది.
అయితే అదే టైమ్ లో వ్యాస్ కోసం లీల (ప్రాచీథాకర్)అనే అమ్మాయి వెతుకుతూ, అతను కనిపించగానే ముద్దు పెడుతుంది. అప్పటి నుండి అతను ఆ మైకంలోనే ఉంటాడు. మళ్ళీ లీల కనిపించడంతో అందరి ముందు ఆమెకు ముద్దు పెడతాడు. దాంతో లీల అందరి ముందే వ్యాస్ ని అవమాన పరుస్తుంది. ఆ సంఘటనతో కోపం రావడంతో వ్యాస్ ఆమెను కిడ్నాప్ చేస్తాడు. లీలను కిడ్నాప్ చేసిన తర్వాత వ్యాస్ ఏం చేశాడు? అసలు వీళ్లిద్దరి బ్యాక్ గ్రౌండ్ ఏమిటి? ఈ కేసును పోలీసులు ఎలా చేధించారు అనేది మిగిలిన కథ.
విశ్లేషణ:
Ads
డైరెక్టర్ సరికొత్త పాయింట్ తో సినిమాను తెరకెక్కించారు. ఈ మూవీలో హీరో బాధను ప్రేక్షకులు సైతం ఫీలయ్యేలా దర్శకుడు చూపించారు. హీరోగా నటించిన చేనాగ్ కి ఇది తొలి చిత్రం అయినా మొదటిసారి నటించిన ఫీల్ కనపడకుండా నటించారు. కొన్ని ఎమోషన్స్ సన్నివేశాలలో, యాక్షన్స్ సీన్స్ లో చక్కగా నటించారు.
హీరోయిన్ ప్రాచీథాకర్ లీల పాత్రలో ఒదిగిపోయి నటించింది. మిగిలిన నటీనటులు తమ పాత్రలకు న్యాయం చేశారు. దర్శకుడు స్క్రీన్ ప్లే చాలా బాగా చూపించారు. డైలాగ్స్ ఆకట్టుకున్నాయి. సాంగ్స్ కూడా పర్వాలేదనిపించాయి. ప్రొడ్యూసర్ ఎక్కడ కాంప్రమైజ్ అవకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇక కెమెరామెన్ వర్క్ చాలా బాగుందని చెప్పవచ్చు.
ప్లస్ పాయింట్స్:
- హీరో నటన,
- సెకండ్ హాఫ్
- ఫ్లాష్ బ్యాక్ సీన్స్
మైనస్ పాయింట్స్:
- సంగీతం,
- కొన్ని సీన్స్ సాగదీత
రేటింగ్:
3.25/5
ట్యాగ్ లైన్ :
డైరెక్టర్ ఈ మూవీని కొత్త కాన్సెప్ట్ తో ఆడియెన్స్ ముందుకు తీసుకువచ్చారు. కొత్త కాన్సెప్ట్ లేదా డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాలను ఇష్టపడేవారికి, థ్రిల్లర్ చిత్రాలను చూసేవారికి ఈ మూవీ నచ్చే ఛాన్స్ ఉంది.
watch trailer :
Also Read: AADIKESHAVA REVIEW: వైష్ణవ్ తేజ్-శ్రీ లీల జంటగా నటించిన “ఆది కేశవ” హిట్టా.? స్టోరీ,రివ్యూ & రేటింగ్!