Ads
తెలుగు సినీ ప్రేక్షకులకు జబర్దస్త్ కమెడియన్ సుడిగాలి సుధీర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. జబర్దస్త్ షోలో కమెడియన్ గా చేసి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్నారు సుడిగాలి సుధీర్. కేవలం కమెడియన్ గా మాత్రమే కాకుండా మెజీషియన్ గా డాన్సర్ గా,యాక్టర్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్నారు.
బుల్లితెరపై సుడిగాలి సుధీర్ కు ఏ రేంజ్ లో ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉందో మనందరికీ తెలిసిందే. ఇకపోతే మొన్నటి వరకు యాంకర్ గా కమెడియన్ గా తన సత్తాను చాటిన సుధీర్ ఇటీవల కాలంలో పూర్తిగా సినిమాలపై దృష్టి పెట్టి బుల్లితెరకు దూరమయ్యారు.
వరుసగా ఒకధాని తర్వాత ఒకటి సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్నారు. ఒకవైపు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తూనే మరొకవైపు హీరోగా సినిమాలలో నటిస్తున్నాడు. సుధీర్ నటిస్తున్న సినిమాలలో లేటెస్ట్ మూవీ కాలింగ్ సహస్ర. షాడో మీడియా ప్రొడక్షన్స్ రాధా ఆర్ట్స్ బ్యానర్లపై విజేష్ తయాల్, చిరంజీవి పమిడి, వెంకటేశ్వర్లు కాటూరి ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు అరుణ్ విక్కిరాలా దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే.
Ads
ఈ సినిమా డిసెంబర్ ఒకటిన గ్రాండ్ గా థియేటర్లలో విడుదల కానుంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ని కూడా విడుదల చేశారు. ఇప్పటికే ఈ సినిమాపై భారీగా అంచనాలు నెల కొన్నాయి. ఇది ఇలా ఉంటే తాజాగా అందిన సమాచారం ప్రకారం ఈ సినిమాలో ముందుగా హీరోగా సుధీర్ ని అనుకోలేదట. ఈ సినిమాకు ఫస్ట్ ఛాయిస్ సుధీర్ కాదట. మరొక హీరో మిస్ చేసుకోవడం వల్లే ఈ ప్రాజెక్టును సుధీర్ చేస్తున్నారు. ఆ హీరో మరెవరు కాదు అడవి శేష్. దర్శకుడు మొదట అడివి శేష్ కి ఈ కథను వినిపించగా అందుకు ఆయన రిజెక్ట్ చేశారట. దాంతో ఈ సినిమా కథను సుధీర్ కి వినిపించాడట డైరెక్టర్ అరుణ్.
ఈ విషయం గురించి డైరెక్టర్ మాట్లాడుతూ.. గూఢచారి సమయంలో అడివి శేష్ గారికి ఈ కథ చెప్పాను. ఆయన చేయాల్సిన కథ ఇది. కానీ మిస్ అయింది. ఆ సినిమా తర్వాత నేను ఎన్నో యాడ్స్ కి దర్శకత్వం వహించాను. అలాగే సుడిగాలి సుధీర్ త్రీ మంకీస్ సినిమాకు నేను రైటర్ గా పని చేశాను. త్రీ మంకీస్ సినిమా కంటే ముందుగానే ఈ సినిమా కథను సుధీర్ కి వినిపించినప్పుడు నాకెందుకు చెబుతున్నారు? నేను సెట్ అవుతానా అంటూ భయపడ్డారు అని చెప్పుకొచ్చారు దర్శకుడు అరుణ్.