Ads
తెలుగు సినీ పరిశ్రమలో రాముడి పాత్ర అనగానే తెలుగువారి కళ్ళ ముందు మెదిలే రూపం ఎన్టీ రామారావుదే అని చెప్పవచ్చు. ఎన్టీఆర్ రాముడు, కృష్ణుడు, రావణుడు వంటి ఎన్నో పౌరాణిక పాత్రలలో నటించి మెప్పించారు. రాముడి పాత్రలో ఎన్టీఆర్ మాత్రమే కాకుండా కాంతారావు, శోభన్ బాబు, హరినాథ్, లాంటివారు నటించారు.
ఈ జనరేషన్ లో స్టార్ హీరోలు అయిన బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ కూడా రామునిగా నటించారు. అయితే తాజాగా సూపర్ స్టార్ కృష్ణ రాముడిగా కనిపిస్తున్న ఒక రేర్ ఫోటో నెట్టింట్లో వైరల్ గా మారింది. ఈ ఫోటో చూసిన వారు రాముడిగా కృష్ణ ఏ మూవీలో నటించారా అని ఆరా తీస్తున్నారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
సూపర్ స్టార్ కృష్ణ తెలుగు ఇండస్ట్రీలో ఓ సంచలనం. ఆయన హీరో మాత్రమే కాదు, దర్శకుడు, ప్రొడ్యూసర్, స్టూడియో అధినేత. బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన కృష్ణ అసలు పేరు ఘట్టమనేని శివరామకృష్ణ. సాంఘిక, పౌరాణిక, కౌబాయ్, జేమ్స్ బాండ్ వంటి జోనర్ లో కృష్ణ నటించి, మెప్పించారు. తెలుగువారికి జేమ్స్ బాండ్ అంటే కృష్ణ మాత్రమే గుర్తొస్తారు. ఆయన అర్జునుడు, ఏకలవ్యుడు లాంటి పౌరాణిక పాత్రలలో అలరించారు.
Ads
అయితే కృష్ణ శ్రీరాముడిగా చేశారంటే, ఆ పాత్రలో ఎలా ఉంటారు? ఏమూవీలో చేశారు అనే ప్రశ్నలు రావచ్చు. అయితే చాలామందికి తెలియని విషయం ఏమిటంటే సూపర్ స్టార్ కృష్ణ వెండితెర పై శ్రీరాముడిగా కనిపించారు. అయితే అది కొన్ని క్షణాలు మాత్రమే. అందువల్లనేమో ఆ పాత్ర గురించి ఎక్కువగా తెలియలేదు. కృష్ణ కెరీర్ లో టాప్ 10 చిత్రాలలో నిలిచే మూవీ అల్లూరి సీతారామరాజు. ఈ మూవీలో అల్లూరి సీతారామరాజుగా కృష్ణ నటనని తెలుగు ప్రేక్షకులు మరచిపోలేరు. ఈ మూవీలోనే కృష్ణ రాముడిగా కనిపించారు.
ఈ మూవీ క్లైమాక్స్ సీన్ ఎప్పటికీ గుర్తుండి పోతుంది. బ్రిటిష్ సైనికులు సీతారామరాజు ఎదురుగా గన్ పెట్టి షూట్ చేసే టైమ్ లో ఆయన ధైర్యంగా చూస్తూ ఉంటే, కాల్చడానికి వచ్చిన హిందు సైనికుడికి రాముడిగా, క్రిస్టియన్ సైనికుడికి జీసస్ గా, అలాగే ముస్లిం సైనికుడికి వారి పవిత్ర గ్రంధం ఖురాన్ గా కనిపిస్తారు. ప్రస్తుతం ఈ మూవీలో కృష్ణ రాముడిగా కనిపించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Also Read: Dhootha Web Series Review: నాగ చైతన్య “దూత” వెబ్ సిరీస్ ఎలా ఉంది.? స్టోరీ, రివ్యూ & రేటింగ్!