30 ఏళ్ల యంగ్ హీరోకి అక్కగా నయనతార..! ప్రేక్షకులు అంగీకరిస్తారా..?

Ads

ప్రదీప్‌ రంగనాథన్‌, హీరోగా నటిస్తూ, దర్శకత్వం వహించిన లవ్ టుడే మూవీతో కోలీవుడ్ లో సంచలనం సృష్టించాడు. చిన్న సినిమాగా ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజ్ అయిన ఈ మూవీ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. తెలుగులో డబ్ చేసి విడుదల చేయగా ఇక్కడ మంచి విజయాన్ని అందుకుంది.

Ads

లవ్ టుడే మూవీతో ఓవర్ నైట్ స్టార్‌గా మారిన ప్రదీప్‌ రంగనాథన్‌ హీరోగా నటిస్తున్న రెండవ సినిమాకి కోలీవుడ్ డైరెక్టర్ విఘ్నేష్ శివన్ తెరకెక్కించనున్నారు. కొద్దిరోజుల క్రిందట ఈ సినిమాని అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ మూవీ గురించిన ఒక వార్త నెట్టింట్లో హల్చల్ చేస్తోంది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
షార్ట్ ఫిల్మ్స్ తో కెరీర్ మొదలుపెట్టిన ప్రదీప్‌ రంగనాథన్‌, తమిళ ఇండస్ట్రీలో దర్శకుడిగా మొదటి సినిమాతోనే హిట్ అందుకున్నాడు. జయం రవి, కాజల్ అగర్వాల్ జంటగా ‘కోమలి’ అనే సినిమాని తెరకెక్కించాడు. తొలి ప్రయత్నంలోనే డైరెక్టర్ గా కమర్షియల్ హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత దర్శకత్వం చశీనా రెండవ సినిమాలో తానే హీరోగా కోలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చాడు. ఈ మూవీ అనూహ్య విజయాన్ని సాధించడంతో వరుస ఆఫర్స్ రావడం మొదలు అయ్యాయి.
అలా అగ్ర హీరో కమలహాసన్‌ నిర్మించబోయే సినిమాలో ఛాన్స్ వచ్చింది. కానీ బడ్జెట్‌ ఎక్కువ అవడం వల్ల ఆ మూవీ నిలిచిపోయింది. లియో మూవీ ప్రొడ్యూసర్ ప్రదీప్‌ రంగనాథన్‌తో మూవీ చేయడానికి రెడీ అయ్యారు. ఈ సినిమాను లేడి సూపర్ స్టార్ నయనతార భర్త విఘ్నేష్‌ శివన్‌ తెరకెక్కించనున్నారు. ఈ మూవీ షూటింగ్‌ డిసెంబర్ లోనే మొదలు అవనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకి ‘ఎల్‌ఐసీ’ అనే టైటిల్‌ ను పరిశీలిస్తున్నట్లు సమాచారం.
ఈ మూవీలో ఎస్‌ జే సూర్య, డైరెక్టర్ మిష్కిన్‌, యోగిబాబు మొదలగు వారు కీలక పాత్రలలో నటించనున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ మూవీలో హీరోయిన్ గా బాలీవుడ్‌ హీరోయిన్ నటించే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. లేదంటే స్టార్ హీరోయిన్ నయనతార హీరో ప్రదీప్‌ రంగనాథన్‌ అక్కగా లీడ్ రోల్ లో నటించనున్నట్లు సమాచారం. ఈ చిత్రానికి మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్‌ సంగీతాన్ని సమకూరుస్తాడని తెలుస్తోంది. అయితే ఈ విషయం గురించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Also Read: సూపర్ హిట్ సినిమాలలో మంచి పాత్రలను రిజెక్ట్ చేసిన 8 మంది హీరోయిన్లు ఎవరో తెలుసా?

Previous articleకాలింగ్ సహస్ర సినిమా కోసం “సుడిగాలి సుధీర్” ప్లేస్ లో… మొదటిగా అనుకున్న హీరో ఎవరో తెలుసా..?
Next articleసీనియర్ ఎన్టీఆర్ గారి పెళ్లి పత్రిక చూసారా.? వివాహం ఎక్కడ జరిగింది అంటే.?
Hai this is Kavitha. Cover the media industry. I write on the Movies, TV channels, OTT platforms and anything that is a medium for content distribution.