Ads
తెలంగాణ అసెంబ్లీ ఎలెక్షన్స్ లో సంచలనాలు నమోదు అయ్యాయి. హ్యాట్రిక్ విజయం సాధించి, మరోసారి అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేసిన బిఆర్ఎస్ ఓటమి చవిచూసింది. ఊహించని రీతిలో కాంగ్రెస్ విజయన్ని అందుకుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత మొదటిసారి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుంది.
Ads
కొన్ని చోట్ల సీనియర్ రాజకీయనాయకులు సైతం యువ అభ్యర్ధుల చేతిలో ఓటమి చవి చూశారు. అయితే కామారెడ్డిలో ఎవరు ఊహించని విధంగా ముఖ్యమంత్రి హోదాలో ఉన్న కేసిఆర్ ను, కాంగ్రెస్ సీఎం అభ్యర్ది రేవంత్ రెడ్డిని ఓడించి సంచలనం సృష్టించాడు బీజేపి అభ్యర్ది కాటిపల్లి వెంకట రమణా రెడ్డి. ఆయనెవరో ఇప్పుడు చూద్దాం..
తెలంగాణ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోవడం ఒక ఎత్తయితే, పార్టీ అధినేత మాజీ సీఎం కేసీఆర్ పోటీ చేసిన కామారెడ్డిలో ఓటమి పాలవ్వడం మరో ఎత్తు అని అంటున్నారు. 40 ఏళ్లుగా అపజయం ఎరుగని కేసీఆర్ ను ఓడించిన ఘనత కేవీఆర్ ది. వెంకటరమణా రెడ్డి కామారెడ్డి స్థానిక అభ్యర్ధి. బిజెపి తరుపున అసెంబ్లీ ఎలెక్షన్స్ లో పోటీచేసిన కాటిపల్లి వెంకట రమణా రెడ్డి విజయం సాధించారు. ఈసారి ఎన్నికలలో కీలకంగా మారిన కామారెడ్డి అసెంబ్లీలో కేవీఆర్‌గా పేరుగాంచిన కాటిపల్లి వెంకట రమణా రెడ్డి బీఆర్‌ఎస్ అధినేత కేసిఆర్ పై 6,741 ఓట్లతో, తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్‌రెడ్డి పై 11,736 ఓట్ల తేడాతో గెలుపొందారు.వృత్తిరీత్యా వ్యాపారవేత్త అయిన కేవీఆర్ తన రాజకీయ కెరీర్ ను కాంగ్రెస్‌తో మొదలుపెట్టారు. 2004లో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నిజామాబాద్ జిల్లాలోని మండల పరిషత్ ప్రాదేశిక మండలి సభ్యునిగా చేశారు. ఆ తర్వాత జిల్లా పరిషత్ ప్రాంతీయ మండలి సభ్యునిగా, జిల్లా పరిషత్ చైర్‌పర్సన్‌గా పనిచేశారు. ముఖ్యమంత్రి వైఎస్ఆర్ చనిపోయిన తర్వాత, 2014 అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్ఎస్ (అప్పటి టిఆర్ఎస్)కి మద్దతు ఇవ్వడం మొదలుపెట్టారు. 2018 అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీలో చేరారు.
2018 ఎన్నికల తర్వాత కేవీఆర్ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ప్రజల నుండి మన్ననలను పొందారు. కామారెడ్డిలో రైతులు పట్టణ డ్రాఫ్ట్ మాస్టర్ ప్లాన్ కు వ్యతిరేకంగా ఉద్యమం చేసిన సమయంలో వారితో వెంకటరమణా రెడ్డి ఉన్నారు. బీజేపీలో చేరిన డ్వాక్రా గ్రూప్ మహిళలకు అందాల్సిన పావలా వడ్డీ రుణాల రిలీజ్ కోసం పోరాడారు. నవయువ భేరి నిర్వహించి యువతకు పాలిటిక్స్ పై అవగాహన కల్పించారు. పలు విషయాలలో ప్రజల కోసం కార్యక్రమాలు నిర్వహిస్తూ, మంచిపేరు తెచ్చుకున్నారు.
Also Read: TS ELECTIONS 2023: తెలంగాణ ఎన్నికలలో పోటీ చేస్తున్న ఈ 6 మంది అభ్యర్థుల అసలు పేర్లు ఏమిటో తెలుసా..?