Ads
ఐపీఎల్ 2024 సీజన్ కోసం మినీ వేలం డిసెంబర్ 19న జరుగనున్న విషయం తెలిసిందే. ప్లేయర్స్ రిటెన్షన్, రిలీజ్ ప్రాసెస్ కూడా ముగిసింది. ఫ్రాంచైజీలన్నీ కావాల్సిన ప్లేయర్స్ ను జట్టులో ఉంచుకొని వద్దనుకున్న ప్లేయర్స్ ను రిలీజ్ చేశాయి.
ఐపీఎల్ వేలంలో ఫ్రాంచైజీలు రిలీజ్ చేసిన ప్లేయర్లతో సహా మొత్తం 1166 మంది ఆటగాళ్లు పేర్లు రిజిస్టర్ చేసుకున్నారు. ఈ క్రమంలో భారత మాజీ క్రికెటర్ దీప్ దాస్ గుప్తా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ఢిల్లీ క్యాపిటల్స్ రిటైన్ చేసుకున్న క్రికెటర్ రిషబ్ పంత్, సీఎస్‌కే కు వెళ్లే ఛాన్స్ ఉందంటూ కామెంట్స్ చేశాడు. సీఎస్‌కే కెప్టెన్సీ పై చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
ఐపీఎల్ 2024 సీజన్ ట్రేడింగ్ విండో ఈనెల 12 వరకూ అందుబాటులో ఉంటుంది. ఈ క్రమంలో మాజీ క్రికెటర్ దీప్ దాస్ గుప్తా చేసిన కామెంట్స్ ఆసక్తికరంగా మారాయి. ఐపీఎల్ 2024 కోసం చెన్నై సూపర్ కింగ్స్ ఎంఎస్ ధోనీని రిటైన్ చేసుకుంది. కానీ 2025 సీజన్ వరకు ధోనీ అందుబాటులో ఉండడం పై సందేహాలు ఉన్నాయి. దానికి కారణం ధోనీ వయసు పెరుగుతుండడమే.
Ads
ధోనీ వయసు ప్రస్తుతం 42 సంవత్సరాలు. 2025 సీజన్ వరకు ఫిట్ గా ఉండడం పై అనుమానాలున్న నేపథ్యంలో ధోనీ తన వారసుడిగా క్రికెటర్ రిషబ్ పంత్‌ను తీర్చిదిద్దే ఛాన్స్ ఉందని గుప్తా అభిప్రాయపడ్డారు. 2022 లో జరిగిన ఐపీఎల్ లో సీఎస్‌కే కెప్టెన్‌గా ధోనీ స్థానంలో రవీంద్ర జడేజాను తీసుకున్నారు. కానీ అతను దారుణంగా విఫలమయ్యాడు. దాంతో ధోనీనే మళ్ళీ కెప్టెన్‌గా ఉండాల్సి వచ్చింది.
2023 ఐపీఎల్ వేలంలో కెప్టెన్‌ను చేయడానికి బెన్ స్టోక్స్‌ను సీఎస్‌కే కొనుగోలుచేసింది. అయితే అతను 2 మ్యాచులు మాత్రమే ఆడి గాయం కావడంతో మిగిలిన మ్యాచ్‌లు ఆడలేదు. 2024 నుంచి కూడా వైదొలిగాడు. ఈ క్రమంలోనే ధోనీ కెప్టెన్ ప్లేస్ ని రిషబ్ పంత్ తో భర్తీ చేసే ఛాన్స్ ఉందని దీప్ దాస్ గుప్తా అంచనా వేశాడు.
Also Read: ఈ ప్లేయర్ కోసం 5 జట్లు పోటీ పడుతున్నాయా..? 8 సంవత్సరాల తరువాత ఐపీఎల్ లోకి..? ఎవరంటే..?