Ads
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో అత్యధిక మెజార్టీతో గెలిచిన అభ్యర్థిగా కుత్బుల్లాపూర్ బీఆర్ఎస్ అభ్యర్థి వివేకానంద నిలిచారు. ఆయన తన సమీప అభ్యర్థి అయిన కూన శ్రీశైలం గౌడ్ పై 85 వేల 576 ఓట్ల తేడాతో విజయం సాధించారు.
వివేకానంద టోటల్ గా లక్షా 87 వేల 999 ఓట్లు పొందారు. ఆ తర్వాతి స్థానంలో నిలిచిన కూన శ్రీశైలం గౌడ్‌కు లక్షా 2 వేల 423 ఓట్లు పోల్ అయ్యాయి. మూడో స్థానంలో నిలిచిన కాంగ్రెస్ అభ్యర్థి కొలను హన్మంత రెడ్డికి లక్షా 15 వందల 54 ఓట్లు వచ్చాయి.
వివేకానంద్ ఎమ్మెల్యేగా అత్యధిక మెజారిటీతో గెలవడమే కాకుండా వరుసగా మూడోసారి గెలిచి, హ్యాట్రిక్ సాధించారు. మేడ్చల్‌లో మున్సిపాలిటీగా ఉన్న కుత్బుల్లాపూర్ 2009 వ సంవత్సరంలో నియోజకవర్గంగా మారింది. అప్పుడు జరిగిన ఎలెక్షన్స్ లో ఇండిపెండెంట్ గా పోటీచేసిన కూన శ్రీశైలంగౌడ్ విజయం సాధించారు. అయితే ఆ తర్వాత 2014-2023 వరకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వరుసగా మూడు సార్లు ఎమ్మెల్యేగా వివేకానంద గెలుస్తూ వచ్చారు.
గత అసెంబ్లీ ఎలెక్షన్స్ లో వివేకానంద్ 41,500 మెజార్టీతో గెలవగా, తాజాగా జరిగిన ఎన్నికలలో 85,576 భారీ మెజారిటీతో గెలిచి, చరిత్ర సృష్టించారు. తెలంగాణలోనే అత్యధిక మెజారిటీతో విజయం సాధించిన ఎమ్మెల్యేగా రికార్డు సృష్టించారు. కుత్బుల్లాపూర్ పోటీలో కాంగ్రెస్, బీజేపీ ల నుండి స్ట్రాంగ్ క్యాండిడేట్లు ఉన్నా, బీఆర్‌ఎస్ పార్టీ తరుపున పోటీ చేసిన వివేకానంద్ గెలిచారు. వివేకానంద్ కు అత్యధిక మెజార్టీ సాధించడం వెనుక దీని వెనుకున్న కారణం ఆయన చేసిన పనులే అని ఆ నియోజకవర్గ ప్రజలు అంటున్నారు.
ప్రజలందరికి నిత్యం అందుబాటులో ఉంటూ, సొంత పార్టీ కార్యకర్తలైనా, ఇతర పార్టీ కార్యకర్త అయినా పని మీద వివేకానంద్ దగ్గరకు వెళ్ళినపుడు కాదనకుండా వారి పనులు చేశారనే నమ్మకం ఆ నియోజకవర్గ ప్రజలలో ఏర్పడింది. సౌమ్యుడిగా పేరు తెచ్చుకుని, అన్ని మతాల, వర్గాల వారికి ఎలాంటి భేదాభిప్రాయాలు చూపకుండా ఎమ్మెల్యేగా అభివృద్ధి మరియు సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ ప్రజలకు దగ్గరయ్యారు. పాదయాత్రలతో వారి సమస్యలు తెలుసుకుంటూ, స్థానికంగా అందుబాటులో ఉండడం వల్లనే ఇంత మెజారిటీ సాధించినట్టు తెలుస్తోంది.
Ads
Also Read: కామారెడ్డిలో కేసీఆర్, రేవంత్ రెడ్డిలని ఓడించిన… ఈ “కాటిపల్లి వెంకటరమణారెడ్డి” ఎవరు..?