Ads
ప్రస్తుతం తెలంగాణలో ఎక్కువగా వినిపిస్తున్న వ్యక్తి పేరు రేవంత్ రెడ్డి. తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. ఇంక రేవంత్ రెడ్డి విషయానికి వస్తే రేవంత్ రెడ్డి మహబూబ్ నగర్ జిల్లాకు చెందినవారు. రేవంత్ రెడ్డి ఒక వ్యవసాయ కుటుంబంలో జన్మించారు.
చిన్నప్పటి నుండి రాజకీయాలు అంటే ఆసక్తి ఉన్న రేవంత్ రెడ్డి, కాలేజ్ చదువుతున్నప్పుడే అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్ నాయకుడిగా బాధ్యతలు నిర్వర్తించారు. అయితే దాదాపు 8 సంవత్సరాల క్రితం, అంటే 2015 లో జరిగిన ఒక సంఘటన గురించి ఇప్పుడు మాట్లాడుకుంటున్నారు.
అదేంటంటే, 2015 మే 31వ తేదీన రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి వేం నరేందర్‌రెడ్డికి అనుకూలంగా ఓటు వేయాలని నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌కు రూ.50 లక్షలు ఇవ్వజూపిన రేవంత్‌ని అవినీతి నిరోధక శాఖ అధికారులు అరెస్ట్ చేశారు. అప్పుడు రేవంత్ రెడ్డి జైలుకి వెళుతూ, “మీ అంతు చూస్తాను” అని కెసిఆర్ కి చెప్పి వెళ్లారు. అయితే అప్పుడు రేవంత్ రెడ్డి జైల్లో ఉన్నప్పుడు 12 గంటల బెయిల్ తీసుకొని బయటికి వెళ్లాల్సి వచ్చింది.
Ads
జూన్ లో ఒకరోజు రేవంత్ రెడ్డి ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు బెయిల్ తీసుకున్నారు. అందుకు కారణం ఆ రోజు రేవంత్ రెడ్డి కూతురు నిశ్చితార్థం ఉండడం. రేవంత్ రెడ్డి కూతురు నైమిషా రెడ్డి భీమవరానికి చెందిన సత్యనారాయణ రెడ్డిని పెళ్లి చేసుకున్నారు. సత్యనారాయణ రెడ్డి అండ్ రెడ్డి మోటార్స్ ఓనర్ అయిన జి వెంకటరెడ్డి కొడుకు. వీరి నిశ్చితార్దానికి హాజరు అవడం కోసం రేవంత్ రెడ్డి బెయిల్ తీసుకున్నారు. కానీ ఆ సమయంలో రేవంత్ రెడ్డి ఎలాంటి రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొనరు అనే షరతు కూడా పెట్టారు.
అంతే కాకుండా బెయిల్ తీసుకొని బయటికి వచ్చిన సమయంలో మీడియాతో మాట్లాడకూడదు అని, ఒక పర్సనల్ బాండ్, 50 వేల విలువ చేసే రెండు షూరిటీలతో ఈ బెయిల్ ని మంజూరు చేశారు అని సమాచారం. అలా రేవంత్ రెడ్డి బయటికి వచ్చి 12 గంటల వ్యవధిలో తన కూతురిని నిశ్చితార్థ వేడుకలో పాల్గొన్నారు. అలా 12 గంటలు పూర్తి అవ్వగానే మళ్ళీ రేవంత్ రెడ్డి జైలుకి వెళ్లారు. 2015, జూలై 1వ తేదీన రేవంత్ రెడ్డి మళ్ళీ జైలు నుండి విడుదల అయ్యారు.
ALSO READ : రేవంత్ రెడ్డి గురించి ఈ విషయాలు తెలుసా..? అయన బ్యాక్‌గ్రౌండ్ ఏంటంటే..?