Ads
ప్రస్తుతం ఎక్కడ చూసినా కాంగ్రెస్ పేరు వినిపిస్తోంది. అయితే కాంగ్రెస్ తో పాటు మరొక వ్యక్తి పేరు కూడా గట్టిగా వినిపిస్తోంది. ఆ వ్యక్తి పేరు సునీల్ కనుగోలు. ఈ వ్యక్తి ఏ నియోజకవర్గంలో పోటీ చేశారు అని ఆలోచించకండి. ఇతను కాంగ్రెస్ తరపున పోటీ చేసిన వ్యక్తి కాదు.
కానీ కాంగ్రెస్ గెలవడానికి ముఖ్య పాత్ర పోషించారు. అసలు ఈయన ఎవరో ఇప్పుడు చూద్దాం. బీబీసీ తెలుగు కథనం ప్రకారం, సునీల్ కనుగోలు కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ టాస్క్ ఫోర్స్ సభ్యుడిగా పదవిలో ఉన్నారు. బళ్లారిలోని తెలుగు మాట్లాడే కుటుంబంలో సునీల్ జన్మించారు.
అమెరికాలో ఎంబీఏ చేశారు సునీల్. ఆ తర్వాత అక్కడే ఒక కన్సల్టెన్సీలో పని చేశారు. అసోసియేషన్ ఆఫ్ బ్రిలియంట్ మైండ్స్ అనే ఒక సంస్థకి సహా వ్యవస్థాపకుడిగా సునీల్ ఉన్నారు. ఇటీవల జరిగిన కర్ణాటక ఎన్నికల్లో కూడా సునీల్ వ్యూహాలు చాలా బాగా పని చేశాయి. ఇప్పుడు తెలంగాణ ఎన్నికల్లో కూడా ఇదే జరిగింది అని అంటున్నారు. 2014 లో నరేంద్ర మోడీని అభ్యర్థిగా ప్రచారం చేయడానికి ప్రశాంత్ కిషోర్ తీసుకువచ్చిన సిటిజన్స్ ఆఫ్ అకౌంటబుల్ గవర్నెన్స్ లో సునీల్ భాగస్వామిగా ఉన్నారు.
Ads
అయితే 2022లో ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ లో చేరేందుకు ప్రయత్నం చేశారు. సునీల్ కూడా అదే పార్టీలో చేరారు. 2022 లో కాంగ్రెస్ పార్టీ కీలక ఎన్నికల వివాకర్తగా సునీల్ నియమితులు అయ్యారు. అక్కడ సోనియా గాంధీ సునీల్ ని 2024 లోక్ సభ పోల్స్ టాస్క్ ఫోర్స్ సభ్యునిగా నియమించారు. కర్ణాటక ముఖ్యమంత్రిగా బొమ్మై ఉన్న సమయంలో 40% కమిషన్ తీసుకుంటున్నారు అంటూ కర్ణాటక కాంట్రాక్టర్స్ అసోసియేషన్ ఆరోపణలని చేశారు.
అప్పుడు వీటిని కాంగ్రెస్ ప్రచారాస్త్రంగా సునీల్ మార్చారు. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ గెలవగానే అక్కడి ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సునీల్ ని తన సలహాదారులుగా నియమించుకొని, క్యాబినెట్ ర్యాంక్ కూడా ఇచ్చారు. అంతే కాకుండా కర్ణాటక విధాన సౌధలోని మూడవ ఫ్లోర్ లో ఉన్న ముఖ్యమంత్రి కార్యాలయ ప్రాంగణంలోనే సునీల్ కి కార్యాలయాన్ని కూడా కేటాయించారు.
కానీ సునీల్ ఈ పదవిని తీసుకోలేదు. తెలంగాణతో పాటు మిగిలిన రాష్ట్రాల ఎన్నికల బాధ్యతలు కూడా సునీల్ మీద ఉన్నాయి. కాబట్టి సునీల్ వీటి మీద దృష్టి పెట్టారు. ఇటీవల కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో విని అందరూ ఆశ్చర్యపోయారు. ఈ మేనిఫెస్టో వెనుక కూడా సునీల్ ప్లాన్ ఉంది అని వార్తలు వస్తున్నాయి. ఈ మేనిఫెస్టో రూపొందించడంలో కీలక పాత్రధారి సునీల్ అని అంటారు.