Ads
యానిమల్… యానిమల్… యానిమల్. ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ సినిమా పేరు వినిపిస్తూనే ఉంది. అంతకుముందు అర్జున్ రెడ్డి సినిమా కేవలం రెండు తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే సంచలనం సృష్టించింది. మిగిలిన ఇండస్ట్రీ వాళ్ళు ఈ సినిమా గురించి మాట్లాడుకున్నారు. అంతే.
కానీ ఇప్పుడు ఈ యానిమల్ సినిమా అన్ని భాషల్లో రిలీజ్ అవ్వడంతో దీని గురించి మాట్లాడటం కాదు. ఏకంగా డిస్కషన్లు పెట్టేస్తున్నారు. సినిమాకి బాగా కలెక్షన్స్ వస్తున్నాయి. కొన్ని మంచి కామెంట్స్ కూడా వస్తున్నాయి. అదే విధంగా కొన్ని చెడు కామెంట్స్ కూడా వస్తున్నాయి.
సినిమాలో హీరో పాత్రని రూపొందించిన విధానం చాలా మందికి నచ్చలేదు. ఆ హీరో పాత్ర హీరోయిన్ ని ట్రీట్ చేసిన విధానం అయితే చాలా మందికి కోపం తెప్పించింది. అయితే ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఒకటి. సినిమాలో హీరో ఒక యానిమల్. అంటే జంతువు. జంతువులకి నైతిక విలువల లాంటివి ఉండవు. అవి తప్పు చేస్తున్నాయా, కరెక్ట్ చేస్తున్నాయా అనే విషయాలు కూడా వాటికి తెలియదు. ఇందులో హీరో ఒక జంతువు కాబట్టి ఒక జంతువు లాగానే ప్రవర్తించాడు. ఒక జంతువు లాగానే మాట్లాడాడు.
దాని వల్ల అతను చాలా కోల్పోయాడు. సినిమా టైటిల్ కి హీరో ప్రవర్తన న్యాయం చేసింది. హీరో ప్రవర్తనని ఈ సినిమాలో కరెక్ట్ అని చూపించలేదు. అతను చేసిన పనుల వల్ల చాలా మంది ఇబ్బందులు పడ్డారు. వారు అతనికి దూరం అయ్యారు. అతను లాస్ట్ కి ఏకాకి అయిపోయాడు. తన కుటుంబం మొత్తాన్ని కోల్పోయాడు. కాబట్టి అతను అలా ప్రవర్తించడం వల్ల వచ్చే లాభాల కంటే, నష్టాలు ఎక్కువగా ఉన్నట్టు చూపించారు. అయితే ఇందులో హీరో వల్ల అందరికంటే ఎక్కువగా ఇబ్బంది పడ్డ వ్యక్తి గీతాంజలి.
“అసలు హీరోయిన్ పాత్రని ఇంత చెత్తగా ఎలా రాశారు?” అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కానీ ఇటీవల కాలంలో వచ్చిన చాలా సినిమాలతో పోలిస్తే ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర ఒక బెస్ట్ హీరోయిన్ పాత్ర. నిజంగా సినిమాలో ఒక హీరోయిన్ కి ఎంత ప్రాముఖ్యత ఉండాలో అంతే ప్రాముఖ్యత ఇచ్చారు. పతియే ప్రత్యక్ష దైవం అన్నట్టుగా కూడా హీరోయిన్ ప్రవర్తించలేదు. నిజానికి ఈ సినిమాలో గీతాంజలి చాలా కష్టాలు ఎదుర్కొంది. ఒక రకంగా చెప్పాలి అంటే రణవిజయ్ కంటే కూడా గీతాంజలి పాత్ర చాలా కష్టాలు పడింది.
Ads
తనకి ఒక వ్యక్తితో ఎంగేజ్మెంట్ అవుతున్నప్పుడు విజయ్ వస్తాడు. “నీకు పుట్టే పిల్లలు ఆరోగ్యంగా పుడతారు” లాంటి మాటలు విజయ్ మాట్లాడతాడు. అయినా కూడా అతన్ని ఇష్టపడుతుంది. అతని కోసం ఇంట్లో వాళ్ళందరినీ కాదనుకొని వచ్చేస్తుంది. పిల్లలు కనే సమయంలో కూడా పుట్టింటి వారు, అత్తింటి వారు గీతాంజలికి ఎటువంటి సహాయం చేయరు.
దాంతో ఆ సమయంలో చాలా కష్టాలు పడుతుంది. తర్వాత పిల్లలు పుట్టి, భర్తతో సంతోషంగా ఉంటున్న సమయంలో భర్త తీసుకొచ్చి, తన తండ్రి కోసం తను కొన్ని పనులు చేయాలి అని, అందుకే గీతాంజలి వాళ్లు కూడా ఇక్కడే ఉండాలి అని చెప్పి కష్టాలని ఇంకా పెంచుతాడు.పెళ్లి అయ్యి 8 సంవత్సరాలు అయినా కూడా గీతాంజలిని తన అత్తింటి వారు ఇంకా అంగీకరించరు. అయినా సరే వారితోనే ఉంటూ ఇబ్బందులు పడుతుంది.
తర్వాత విజయ్ కి ఒంట్లో బాలేని సమయంలో, విజయ్ ఎన్ని మాటలు అన్నా కూడా భరిస్తుంది. గీతాంజలి పుట్టినరోజు అని కూడా చూడకుండా విజయ్ కొడతాడు. అయినా కూడా అతన్ని క్షమిస్తుంది. కానీ ఇన్ని చేసిన గీతాంజలికి కష్టాలు తగ్గకుండా ఇంకా పెరుగుతూనే ఉంటాయి. తన భర్త కోసం వ్రతం చేసి, ఉపవాసం ఉండి ఎదురు చూస్తూ ఉంటే విజయ్ వచ్చి తనకి మరొక అమ్మాయితో సంబంధం ఉంది అని చెప్తాడు. ఇక్కడ గీతాంజలి తన సహనాన్ని కోల్పోతుంది.
“ఎందుకు ఇలా చేశావు?” అని అడిగితే, తన తండ్రి కోసం అని విజయ్ ఒక కారణం చెప్తాడు. వెళ్లి ఆ అమ్మాయిని చంపేసి రమ్మంటుంది. అందుకు విజయ్ ఒప్పుకోడు. దాంతో విజయ్ కి అమ్మాయి అంటే ఇష్టం అని అర్థం చేసుకుంటుంది. ప్రేమించిన వ్యక్తి కోసం అందరినీ వదిలేసి వచ్చిన అమ్మాయి అయిన గీతాంజలి ఈ విషయాన్ని తట్టుకోలేక పోతుంది.
అప్పటికి విజయ్ గీతాంజలి తనకి చాలా ఇష్టం అని చెప్తూనే ఉంటాడు. అయినా సరే ఈసారి మాత్రం గీతాంజలి తన ఆత్మ అభిమానాన్ని వదులుకోకుండా విడాకులు అడుగుతుంది. విజయ్ ని వదిలి వెళ్ళిపోతుంది. ఇంత గొప్ప క్యారెక్టర్ ఆర్క్ ఉన్న పాత్ర, అందులోనూ ఇంత గొప్ప కథ ఉన్న హీరోయిన్ పాత్ర ఇటీవల ఏ స్టార్ హీరో సినిమాలో కూడా రాలేదు. కాబట్టి గీతాంజలి పాత్ర భారతీయ సినిమా చరిత్రలోనే ఒక గొప్ప హీరోయిన్ పాత్ర.
ALSO READ : సూపర్ హిట్ సినిమాలలో మంచి పాత్రలను రిజెక్ట్ చేసిన 8 మంది హీరోయిన్లు ఎవరో తెలుసా?