Ads
సినిమాలు మాత్రమే కాదు. కొన్ని సీరియల్స్ కూడా ప్రేక్షకులకు ఎన్ని సంవత్సరాలు అయినా గుర్తుండిపోతాయి. అందులోనూ ముఖ్యంగా కొన్ని డబ్బింగ్ సీరియల్స్ అయితే చాలా గుర్తుంటాయి. అలా హిందీలో రూపొందిన తర్వాత తెలుగులోకి డబ్ అయ్యి పాపులారిటీ సంపాదించుకున్న సీరియల్స్ సిఐడి.
సిఐడి లో నటించిన నటులు వారి సొంత పేర్ల కంటే పాత్రల పేర్లతోనే ఎక్కువగా గుర్తున్నారు. అలా సిఐడిలో నటించి గుర్తింపు తెచ్చుకున్న నటుడు ఫెడ్రిక్స్. అసలు పేరు దినేష్ ఫడ్నిస్. 1998 లో వచ్చిన సిఐడి సీరియల్ దాదాపు 20 సంవత్సరాలు కొనసాగింది.
ఈ 20 సంవత్సరాలు తన నటనతో ప్రేక్షకులని నవ్వించారు దినేష్. దినేష్ డిసెంబర్ ఒకటవ తేదీన గుండెపోటు కారణంగా ఆస్పత్రిలో చేరారు. వెంటిలేటర్ పై చికిత్స పొందుతూ ఉన్న దినేష్ ఇవాళ చివరి శ్వాస విడిచారు. ఎంతో మంది ప్రముఖులు దినేష్ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తున్నారు. అయితే దినేష్ చనిపోవడానికి కేవలం గుండె సమస్య కారణం అని తెలుస్తోంది. దినేష్ వయసు 57 సంవత్సరాలు.
Ads
ఇంత చిన్న వయసులో దినేష్ చనిపోవడం పట్ల ఎంతో మంది సంతాపం వ్యక్తం చేస్తున్నారు. 1966 నవంబర్ 2వ తేదీన దినేష్ జన్మించారు. సిఐడిలో నటించడం మాత్రమే కాకుండా దినేష్ కొన్ని సినిమాలు కూడా చేశారు. అంతే కాకుండా సిఐడిలో కొన్ని ఎపిసోడ్స్ రాశారు కూడా. సర్ఫరోష్, మేళ, ఆఫీసర్ వంటి సినిమాల్లో దినేష్ నటించారు. సిఐడితో పాటు సిఐడి స్పెషల్ బ్యూరోలో నటించారు. అంతే కాకుండా అదాలత్, తారక్ మెహతా కా ఉల్టా ఛష్మా వంటి సీరియల్స్ లో తాను పోషించిన ఫెడ్రిక్స్ పాత్రతోనే కనిపించారు.
దినేష్ చివరిగా 2019 లో వచ్చిన సిఐఎఫ్ సిరీస్ లో నటించారు. ఇందులో కానిస్టేబుల్ శంభు తావిడే పాత్రలో నటించారు. దినేష్ తెలుగు వారికి పరిచయం లేకపోయినా కూడా సిఐడిలో ఆయన పోషించిన పాత్ర ద్వారా చాలా ఫేమస్ అయ్యారు. దాంతో సిఐడి రెగ్యులర్ గా ఫాలో అయ్యే తెలుగు వారికి దినేష్ కచ్చితంగా తెలిసే ఉంటారు. దాంతో దినేష్ మృతి పట్ల కేవలం హిందీ వారు మాత్రమే కాకుండా ఎంతో మంది తెలుగు వారు కూడా తమ సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు.
ALSO READ : 30 ఏళ్ల యంగ్ హీరోకి అక్కగా నయనతార..! ప్రేక్షకులు అంగీకరిస్తారా..?