Ads
మనకు ఎన్నో గేమ్స్ ఉన్న క్రికెట్ అంటే మక్కువ ఎక్కువ. క్రికెట్ సీజన్ వచ్చిందంటే సెలబ్రిటీలు సైతం మ్యాచుల కోసం ఎదురుచూస్తారు. క్రికెట్ సెలబ్రిటీల్ని దేవుళ్ళుగా కొలిచే జనాలు కూడా మన మధ్య ఉన్నారు.
ఆనాటి సునీల్ గవాస్కర్ కపిల్ దేవ్ దగ్గర నుంచి.. నేటి సచిన్, ధోని ,విరాట్ కోహ్లీ వరకు అభిమానులకు కొదవలేదు. అంతగా క్రికెట్ క్రేజ్ ఉన్న మనదేశంలో మొదటి టీం ఇండియా కెప్టెన్ ఎవరో తెలుసా?
ఇంతకుముందు ఇండియాలో క్రికెట్ కి ఇంత ఆదరణ ఉండేది కాదు. 1983లో భారత్ జట్టు ఇండియా కోసం ప్రపంచ కప్ గెలిచిన తర్వాత క్రికెట్ పై మనదేశంలో క్రేజ్ పెరగడం మొదలుపెట్టింది. 1947- 48 లో ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన భారత జట్టుకు సంబంధించిన జాబితా ఫోటోలు ఒక వ్యక్తి తన ట్విట్టర్ లో షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ బాగా వైరల్ అయింది. భారత తరఫున స్వతంత్రం వచ్చాక మొదటిసారిగా అంతర్జాతీయ పర్యటనకు వెళ్ళిన జట్టు ఇదే. మరి ఆ జట్టుకు కెప్టెన్గా వ్యవహరించిన వ్యక్తి ఎవరో తెలుసా?
Ads
ఆ టీం కు సారథ్యం వహించిన అతని పేరు లాలా అమర్నాథ్. వైస్ కెప్టెన్ గా విజయ్ హజారే వ్యవహరించాడు. లిస్టులో ఉన్న ఆటగాళ్లలో కేవలం వినూ మన్కడ్, సీకే నాయుడు, అమరనాథ్, హజారే గురించి మాత్రమే సమాచారం ఉంది మిగిలిన వారి గురించి ఎవరికీ పెద్దగా తెలియడం లేదు.ఈ లిస్టు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఇప్పటికీ నాలుగు లక్షల మంది పోస్టును వీక్షించారు. ఇక ఈ ఫోటో పై స్పందించిన క్రికెట్ అభిమానులు.. ఇది ఒక అమూల్యమైన నిధి అని.. మెచ్చుకుంటున్నారు.
Exactly 76 years ago India first played international cricket as an independent country.
Easily one of my most treasured possessions. pic.twitter.com/ru62TpGbah— Mayukh Ghosh (@stock_delivery) November 27, 2023
ALSO READ : IPL 2024 : CSK కి కెప్టెన్ గా ధోనీ వారసుడు..! ఎవరంటే..?