Ads
తిరుమల తిరుపతి దేవస్థానం.. ప్రసిద్ధిగాంచిన ఈ పుణ్యక్షేత్రంలో గత కొద్దికాలంగా ఏదో ఒక వివాదం చోటు చేసుకుంటుంది. వచ్చిన భక్తులకు అన్నదాన వసతి కల్పిస్తూ ఏర్పాటు చేసిన నిత్య అన్నదానంలో కూడా పొరపాట్లు జరుగుతున్నాయని భక్తులు ఫిర్యాదులు చేస్తున్నారు.
ఈ మేరకు వెంగమాంబ అన్నప్రసాద సముదాయంలో సోమవారం నాడు కొందరు భక్తులు నిరసనకు దిగారు. ఈనాడు ఆంధ్రప్రదేశ్ కథనం ప్రకారం, శ్రీనివాసుని చూడడానికి వచ్చిన భక్తులకు వడ్డించే భోజనం ఇదేనా అంటూ అక్కడ సిబ్బందిని నిలదీశారు. భక్తులకు సిబ్బంది ఏదో ఒకరకంగా నచ్చజెప్పి పంపించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది.
సోమవారం రాత్రి.. మామూలు భక్తులతో పాటు కొందరు అయ్యప్ప స్వాములు నిత్యాన్నదాన భవనానికి భోజనం కోసం వచ్చారు. అయితే వారికి వడ్డించిన అన్నం ఉడకలేదని సిబ్బందికి ఫిర్యాదు చేశారు. అన్నం ముద్దగా ఉంది అని వారు వాపోయారు. ఇది తిరుమల వెంకటేశుని ప్రసాదమేనా? మరి భక్తులకు పట్టించే భోజనం కూడా ఇలా ఉంటే ఎలాగా అంటూ నిలదీశారు. ఎంతోమంది వడ్డించే భోజనం తినలేక విస్తరిలో అలాగే భోజనం వదిలేసి అర్థం ఇస్తున్నారని వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేశారు.
Ads
అయితే చలి కారణంగా అన్నం అలా ముద్దగా అయి ఉంటుంది అని అక్కడ సిబ్బంది నచ్చ చెప్పడానికి ప్రయత్నించారు. అయినా వాళ్లు వినకుండా అన్నదానం సూపరింటెండెంట్ అక్కడికి పిలవాలి అంటూ నిరసనకు దిగారు. ఈ నేపథ్యంలో కొందరు మహిళలు శ్రీవారికి ఓట్లలో భక్తులు విరాళాలు సమర్పిస్తున్నా.. ఆయన భక్తులకు కనీసం సరిగా అన్నం కూడా పెట్టకపోతే ఎలా అని అడిగారు.
తిరుమలలో అన్న ప్రసాదం నాణ్యత పై ఎప్పటినుంచో ఫిర్యాదులు వస్తూనే ఉన్నాయి.దీంతో ఇప్పుడు ప్రస్తుత గుత్తేదారుల దగ్గర నుంచి కాకుండా నీరుగా బియ్యం మిల్లర్లు దగ్గర నుంచి కొనుగోలు చేయాలని టీటీడీ పాలకమండలి నిర్ణయించుకున్నా. మరి ఇకనైనా స్వామివారి అన్న ప్రసాదం భక్తులు తినే విధంగా ఉంటుంది అందరూ ఆశిస్తున్నారు.
ALSO READ : 1981 నాటి “టి.టి.డి” కరపత్రం చూసారా.? అందులో ఏం రాసి ఉందంటే.?