Ads
నాచురల్ స్టార్ నాని ఈసారి మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ తో హాయ్ నాన్న అంటూ ప్రేక్షకులను పలకరించడానికి వచ్చేసాడు. ఇప్పటికే మూవీ నుంచి వచ్చిన టీజర్, ట్రైలర్, పాటలు మూవీపై అంచనాలను ఓ రేంజ్ లో పెంచాయి. ఈ నేపథ్యంలో ఈరోజు థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం ఎంతవరకు ప్రేక్షకులను మెప్పించిందో తెలుసుకుందాం..
- చిత్రం : హాయ్ నాన్న
- నటీనటులు : నాని, మృణాల్ ఠాకూర్, బేబీ కియారా ఖన్నా.
- నిర్మాత : మోహన్ చెరుకూరి (cvm), డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల
- దర్శకత్వం : శౌర్యువ్
- ఛాయాగ్రహణం : సాను జాను వర్గీస్
- సంగీతం : హేషామ్ అబ్దుల్ వహాబ్
- విడుదల తేదీ : డిసెంబర్ 7, 2023
స్టోరీ :
విరాజ్ (నాని).. సెలబ్రిటీ ఫోటోగ్రాఫర్.. ఆతని కూతురు మహి (కియారా).. చిన్నవయసులోనే అరుదైన అనారోగ్య సమస్యతో బాధపడుతూ ఉంటుంది. ఒకపక్క కూతుర్ని జాగ్రత్తగా చూసుకుంటూ మరోపక్క కెరిర్ లో రాణిస్తుంటాడు విరాజ్. వృత్తిరీత్యా ఎంత బిజీగా ఉన్నా కూతురు కోసం సమయం కేటాయించే విరాజ్ కూతురు ను ఎంటర్టైన్ చేయడానికి కథలు చెబుతూ ఉంటాడు. అయితే తండ్రి చెప్పే కథలలో ఎక్కడ తల్లి గురించి చెప్పకపోవడం ఆ పాపకు బాధ కలిగిస్తుంది. అదే విషయం తండ్రిని అడిగితే .. మంచి మార్క్స్ వస్తే చెబుతాను అంటాడు.
పట్టుబట్టి చదివి మంచి మార్కులు తెచ్చుకుంటుంది మహి. కానీ విరాజ్ తల్లి గురించి ఏమీ మాట్లాడడు.. దీంతో బాధ కలిగిన మహి తన పెంపుడు కుక్కను తీసుకొని ఇంటిలో నుంచి వెళ్ళిపోతుంది. ఆ సమయంలో అనుకోకుండా మహిను యాక్సిడెంట్ నుంచి కాపాడుతుంది యష్న (మృణాల్ ఠాకూర్). తర్వాత మహి యష్ణ ను తండ్రికి పరిచయం చేస్తుంది. కూతురు చెప్పిన మాట వినదు అని తెలుసుకున్న విరాట్ చివరకు ఆమెకు.. ఆమె తల్లి స్టోరీ చెబుతాడు. అయితే ఇక్కడ తల్లి క్యారెక్టర్ లో ఎవరిని ఊహించుకోను అని మహి అడిగినప్పుడు పక్కనే ఉన్న యష్న నన్ను ఊహించుకో అంటుంది.
ఇక విరాజ్ చెప్పే కథ విషయానికి వస్తే.. అతని కెరీర్ ప్రారంభ దశలో.. యష్నను చూసి ఇష్టపడతాడు. ఆమె కూడా అతన్ని లవ్ చేస్తుంది. అయితే ఆమె ఇంట్లో వాళ్లకి అతను నచ్చకపోవడంతో ఒప్పుకోరు. దీంతో ఆమె ఇల్లు వదిలిపెట్టి వచ్చేస్తుంది. అయితే మొదటి నుంచి యష్నకు పిల్లలంటే ఇష్టం లేదు. కానీ విరాజ్ కోసం మహికు జన్మనిస్తుంది. మహి పుట్టడంతోటే ఒక అరుదైన అనారోగ్యంతో పుట్టడం వల్ల ఎక్కువగా హాస్పటల్లో గడపాల్సి వస్తుంది.
Ads
ఇది తట్టుకోలేని యష్న.. అసలు పిల్లలు ఎందుకు కన్నానా అని బాధపడుతుంది. ఈ క్రమంలో భార్యాభర్తల మధ్య తగువులు మొదలవుతాయి. ఒకరోజు అనుకోకుండా ఓ కార్ యాక్సిడెంట్ సంభవిస్తుంది. చివరికి ఏమైంది? విరాజ్ కూతురుతో ఒంటరిగా ఎందుకు ఉంటున్నాడు? అతని వైఫ్ ఎక్కడ ఉంది? ఇందులో యష్న పాత్ర ఏంటి? తెలుసుకోవాలంటే సినిమా చూడండి.
రివ్యూ :
తండ్రి కూతుర్ల సెంటిమెంట్ తో సాగే చిత్రం కావడంతో ప్రతి ఒక్క డీటెయిల్ ఎంతో వివరంగా ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వచ్చింది. కాబట్టి అక్కడక్కడ స్టోరీస్ స్లోగా సాగిన ఫీలింగ్ కలుగుతుంది కానీ ఓవర్ ఆల్ గా చిత్రం మంచి ఫీల్ గుడ్ కాన్సెప్ట్ తో ఉంది. ఇందులో నాని భర్తగా, తండ్రిగా, ప్రియుడిగా అద్భుతంగా నటించాడు. అతని కూతురు పాత్ర పోషించిన కియారా భావోద్వేగాలు ఈజీగా ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుతాయి. కంటెంట్ చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడంలో డైరెక్టర్ శౌర్యువ్ బాగా సక్సెస్ అయ్యాడు. మూవీలో మృణాల్ తన అద్భుతమైన నటనతో అందరినీ ఆకట్టుకుంది.
ఫస్ట్ హాఫ్ ఇంటర్వెల్ సీన్ బాగా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. స్టోరీ ఎటువంటి హంగు ఆర్భాటం లేకుండా రెగ్యులర్ గా మన చుట్టుపక్కల జరిగే ఒక మంచి కథలా ముందుకు సాగుతుంది. ఇందులో ఉన్నాయి ఎమోషన్స్ కి ప్రతి ఒక్కళ్ళు కచ్చితంగా కనెక్ట్ అవుతారు. తండ్రి కూతుర్ల మధ్య సెంటిమెంట్ మన హృదయాన్ని టచ్ చేస్తుంది అనడంలో ఎటువంటి డౌట్ లేదు. ఇక క్లైమాక్స్ సీన్ లో కంటతడి పెట్టని వారు ఉండరు.. అలాగని మూవీ అంతా ఏడుపే ఏమీ ఉండదు.. మంచి ఫీల్ గుడ్ మూవీ.. కచ్చితంగా చూడాల్సిన మూవీ.క్లైమాక్స్ ను చాలా బాగా తీర్చిదిద్దాడు డైరక్టర్. ఇందులో ఉన్న ప్రతి సీన్ ఎమోషన్ మనసుని కదిలించే విధంగా ఉంటుంది.
ప్లస్ పాయింట్స్ :
- తండ్రి కూతుళ్ల మధ్య అనుబంధం.
- మూవీలోని ఎమోషన్స్ బాగా ఉన్నాయి.
- మృణాల్ యాక్టింగ్ అద్భుతంగా ఉంది.
- మూవీలో సెంటిమెంట్ యాంగిల్ ఫ్యామిలీ ఆడియన్స్ కి బాగా నచ్చుతుంది.
మైనస్ పాయింట్స్:
- ఫస్ట్ హాఫ్ కాస్త సాగదీతగా ఉంది.
- స్టోరీ బాగా ల్యాగింగ్ గా ఉంటుంది.
- కొన్ని సీన్స్ ఈజీగా గెస్ చేసే విధంగా ఉన్నాయి.
రేటింగ్ :
3.25/5
చివరి మాట :
మొత్తానికి ఫ్యామిలీతో కలిసి చూడదగిన ఒక ఫీల్ గుడ్ మూవీ.
watch trailer :
ALSO READ : కన్నడ “సలార్” లో ప్రభాస్ కి డబ్బింగ్ చెప్పిన ఈ హీరో ఎవరో తెలుసా..? అచ్చం ప్రభాస్ వాయిస్ లానే ఉంది కదా..?