Ads
తెలంగాణ అసెంబ్లీ ఎలెక్షన్స్ లో గెలిచిన కాంగ్రెస్ గవర్నమెంట్ కొలువుదీరేందుకు అంతా సిద్ధమైంది. రేవంత్‌రెడ్డి నేడు హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో రాష్ట్ర మూడవ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ రేవంత్ రెడ్డి మరియు మంత్రులతో ప్రమాణం చేయించబోతున్నారు. ఈ కార్యక్రమానికి ఎవరెవరు వస్తున్నారు? రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఏ ఫైల్ మీద మొదటి సంతకం పెట్టనున్నారో ఇప్పుడు చూద్దాం..
తెలంగాణ రాష్ట్రానికి మూడవ సీఎం రాబోతున్నారు. రీసెంట్ గా జరిగిన అసెంబ్లీ ఎలెక్షన్స్ లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. చాలా చర్చల అనంతరం హైకమాండ్ పీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిగా ప్రకటించింది. నేడు ప్రమాణ స్వీకారం ఎల్బీ స్టేడియంలో జరుగనుంది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి, భట్టి విక్రమార్క,పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు, కొండా సురేఖ, ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీతక్క, దామోదర రాజనర్సింహలు, తుమ్మల నాగేశ్వరరావు, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
ఈ కార్యక్రమానికి సోనియాగాంధీ, ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక, కాంగ్రెస్ అగ్రనాయకులు, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు, వివిధ పొలిటికల్ పార్టీల నాయకులకు టీపీసీసీ ఆహ్వానాలు పంపింది. మాజీ సీఎం కేసీఆర్, టీడీపీ అధినేత చంద్రబాబును కూడా ఆహ్వానించారు. తెలంగాణ జనసమితి ప్రెసిడెంట్ ప్రొఫెసర్ కోదండరామ్, ప్రొఫెసర్ హరగోపాల్, గాదె ఇన్నయ్య, కంచె ఐలయ్యలతో పాటుగా వివిధ కులసంఘాల నాయకులను ఆహ్వానించారు.
తెలంగాణ అమరవీరుల ఫ్యామిలీలకు కూడా ఆహ్వానం పంపారు. అంతేకాకుండా పలువురు సినీ ప్రముఖులకు సైతం ప్రమాణస్వీకారానికి ఆహ్వానాలు పంపారు. ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తరువాత రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఎన్నికల హామీ ఆరు గ్యారంటీలకు సంబంధించిన ముసాయిదా పై మొదటి సంతకం చేయనున్నారని తెలుస్తోంది. ఈ క్రమంలో 6 గ్యారంటీల అమలుచేయడం పైన ముఖ్యంగా చర్చ జరుగుతోంది.
Ads