శ్రీశాంత్, గంభీర్ మధ్య గొడవ ఎందుకు జరిగింది..? అసలు మొదలు పెట్టింది ఎవరు..?

Ads

ఇండియన్ క్రికెటర్లు గౌతమ్ గంభీర్, శ్రీశాంత్ ల గురించి క్రికెట్ ఫ్యాన్స్ కు పరిచయం చేయాల్సిన పని లేదు. ఈ ఇద్దరు ఆటగాళ్లు తమ ఆటతో ఎంతగా పాపులర్ అయ్యారో, వివాదాలతో కూడా అదే రేంజ్ లో పాపులర్ అయ్యారు.

వీరిద్దరూ గొడవకు దిగారు అంటే ఎదురుగా ఉన్నది ఎంత గొప్ప ఆటగాళ్ళు అయిన సరే ఎంత మాత్రం వెనక్కి తగ్గరు. ఇలాంటి ప్లేయర్స్ మధ్య గొడవ జరిగితే ఇంకా ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తాజాగా అలాంటి ఘటన చోటుచేసుకుంది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
క్రికెట్ నుండి రిటైర్ అయిన క్రికెటరలంతా కలిసి ఆడే లెజెండ్స్ లీగ్ 2023 మొదలైంది. ఈ లీగ్ లో భాగంగా ఎలిమినేటర్ మ్యాచ్‌ బుధవారం నాడు జరిగింది. ఈ మ్యాచ్ లో ఇండియా క్యాపిటల్స్, గుజరాత్ జెయింట్స్ టీమ్స్ తలపడిన విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్‌లో ముందుగా ఇండియా క్యాపిటల్స్ బ్యాటింగ్ చేసింది. గుజరాత్ జట్టు బౌలర్ శ్రీశాంత్ వేసిన రెండో ఓవర్‌లో ఇండియా క్యాపిటల్స్ సారధి గంభీర్ సిక్సు, ఫోర్ వరుసగా బాదాడు. దాంతో శ్రీశాంత్ గంభీర్ ను సీరియస్ గా చూశారు.
అగ్రెసివ్‌గా ఉండే గౌతమ్ గంభీర్ ఊరుకుంటాడా, శ్రీశాంత్‌కు నోటితో జవాబు చెప్పాడు. దాంతో శ్రీశాంత్  కూడా ఏదో అన్నాడు. ఇద్దరి మధ్య మాట మాట పెరిగి మైదానంలోనే ఇద్దరు తిట్టుకున్నారు. తీవ్ర స్థాయిలోనే మాటల యుద్ధం జరిగింది. వెంటనే తోటి ప్లేయర్స్, అంపైర్లు వచ్చి గంభీర్,శ్రీశాంత్‌ లకు   సర్దిచెప్పి వివాదాన్ని ఆపారు. అలా ఆ గొడవ సద్దుమణిగింది. మరోసారి వీరిద్దరి మధ్య గొడవ ఏం  జరగకపోవడంతో మ్యాచ్ కొనసాగింది.
ఈ గొడవకు కారణం గంభీరే అని మ్యాచ్ ముగిసిన తరువాత శ్రీశాంత్‌ వెల్లడించాడు. తనని గంభీర్ అసభ్యకరమైన మాటలు అన్నాడని చెప్పాడు. స్టార్ క్రికెటర్ అయిన వీరేంద్ర సెహ్వాగ్ తో పాటు సహచర ప్లేయర్స్  కూడా గంభీర్ గౌరవం ఇవ్వడని శ్రీశాంత్‌ సంచలన కామెంట్స్ చేశాడు. కాగా, గంభీర్-శ్రీశాంత్ మధ్య జరిగిన గొడవకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్‌గా మారింది.

Ads

Also Read: కెప్టెన్సీ పోయిందన్న కోపంలో ఆస్ట్రేలియాకు సాయం చేశాడా..? ఈ ప్లేయర్ ఎవరంటే..?

 

 

Previous articleరేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారానికి ఎవరెవరు వస్తున్నారు..? ముఖ్యమంత్రిగా రేవంత్‌ రెడ్డి మొదటి సంతకం ఏ ఫైల్ మీద పెట్టనున్నారు..?
Next articleహాయ్ నాన్న కంటే ముందే… ఇదే స్టోరీతో వచ్చిన సినిమా ఏదో తెలుసా..? ఈ సినిమా చూశారా..?
Hai this is Kavitha. Cover the media industry. I write on the Movies, TV channels, OTT platforms and anything that is a medium for content distribution.