Ads
హీరో నితిన్, శ్రీలీల కాంబోలో ..వక్కంతం వంశీ డైరెక్షన్ లో తెరకెక్కిన చిత్రం ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్. మంచి ఫ్యామిలీ ఓరియెంటెడ్ కామెడీ మూవీగా ప్రేక్షకుల ముందుకు ఈరోజు వచ్చిన ఈ చిత్రం ఎంతవరకు మెప్పించగలిగిందో తెలుసుకుందాం..
- చిత్రం : ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్
- నటీనటులు : నితిన్, శ్రీలీల, డా. రాజశేఖర్.
- నిర్మాత : ఎన్.సుధాకర్ రెడ్డి, నికితా రెడ్డి
- దర్శకత్వం : వక్కంతం వంశీ
- సినిమాటోగ్రఫీ : ఆర్థర్ A. విల్సన్ ISC, యువరాజ్ J, సాయి శ్రీరామ్
- సంగీతం : హారిస్ జయరాజ్
- విడుదల తేదీ : డిసెంబర్ 8, 2023
స్టోరీ :
జూనియర్ ఆర్టిస్ట్ గా ఉన్న నితిన్ హీరో అవ్వాలి అని తపన పడుతూ ఉంటాడు. అతని కుటుంబం మొత్తం అతనికి సహకరిస్తున్నా తండ్రి మాత్రం అతను చేసే పనిని పెద్దగా మెచ్చుకోడు. ఇలా ఉన్న సమయంలో అతని లైఫ్ లోకి లిఖిత (శ్రీ లీల) ఎంట్రీ ఇస్తుంది. అనుకోకుండా అతనికి హీరో అయ్యే ఛాన్స్ కూడా వస్తుంది. అయితే అదే సమయంలో ఒక ఊరి సమస్యల గురించి నితిన్ తెలుసుకుంటాడు. అన్ఎక్స్పెక్టెడ్ గా వాటిలో అతను ఇన్వాల్వ్ కూడా అవ్వాల్సి వస్తుంది. అసలు ఆ ఊరు సమస్య ఏంటి? హీరో దాన్ని తీర్చడానికి ఏం చేశాడు? అసలు హీరోకి ఊరికి సంబంధం ఏమిటి? ఇందులో రాజశేఖర్ పాత్ర ఏంటి ?తెలుసుకోవాలి అంటే సినిమా చూడాల్సిందే.
రివ్యూ :
ప్రేక్షకులు నిరంతరం కొత్తదనం కోరుకుంటారు కానీ ప్రతిసారి కొత్త స్టోరీ కావాలి అంటే కుదరదు కదా. ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్ మూవీ స్టోరీ చాలా ఆర్డినరీగా మనకు ఇంతకుముందు తెలిసిన విధంగా ఉంటుంది. ఈ మూవీలో చాలా సీన్స్ ఇంతకుముందు సినిమాల్లో చూసినట్లుగా అనిపిస్తుంది. ఒక జూనియర్ ఆర్టిస్ట్ పడే తపనను నితిన్ ఎంతో అద్భుతంగా రిప్రెజెంట్ చేశాడు. ఒక ఆర్డినరీ మ్యాన్ నుంచి ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్ గా ఎదిగే అతని జర్నీని కథ రూపంలో చూపించడంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యాడు.
Ads
ఈ మూవీలో కామెడీ హైలెట్. సందర్భాన్ని పట్టి వచ్చే పంచ్ డైలాగ్స్.. మంచి కామెడీ యాంగిల్ తో నవ్వించే విధంగా ఉన్నాయి. అయితే అక్కడక్కడ కామెడీ డోస్ కాస్త శృతిమించినట్లు కనిపిస్తుంది. మరి ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో కొన్ని సీన్స్ అనవసరంగా తెచ్చి అతికించినట్లుగా ఉంటాయి. రాజశేఖర్ క్యారెక్టర్ అద్భుతంగా తెరకెక్కించారు. చాలా సంవత్సరాల లాంగ్ గ్యాప్ తర్వాత తిరిగి రీఎంట్రీ ఇచ్చిన రాజశేఖర్.. మంచి కామెడీ టైమింగ్ తో అద్భుతంగా అలరించాడు. అతని హాస్య దృక్పథం ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉంది.
నితిన్ ,రాజశేఖర్ మధ్య వచ్చే కామెడీ సీన్స్ ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి. ఇక శ్రీ లీల మాస్ స్టెప్స్ సాంగ్స్ కి ఒక ఊపు తీసుకొచ్చాయి. ఫస్ట్ హాఫ్ ఎంతో సరదాగా సాగుతుంది అనడంలో డౌట్ లేదు కానీ సెకండ్ హాఫ్ లో కాస్త బోర్ అనిపిస్తుంది. సెకండ్ హాఫ్ కామెడీ విషయంలో కొద్దిగా కేర్ తీసుకొని ఉంటే సినిమా ఇంకా బాగుండేది అనిపిస్తుంది.
ప్లస్ పాయింట్స్ :
- నితిన్ ఈ మూవీలో తన ఫుల్ జోష్ తో నటించాడు.
- ఫస్ట్ హాఫ్ కామెడీ
- పాటలు అద్భుతంగా చిత్రీకరించారు.
- మంచి నిర్మాణ విలువలను పాటించారు.
మైనస్ పాయింట్స్:
- కథ రొటీన్ గా ,ఈజీగా గెస్ చేసే విధంగా ఉంటుంది.
- సెకండ్ హాఫ్ బాగా సాగదీతగా అక్కడక్కడా బోరింగ్ అనిపిస్తుంది.
- కొన్ని కామెడీ సీన్స్ అనవసరంగా తెచ్చి స్టోరీకి అతికించినట్లుగా అనిపిస్తుంది.
రేటింగ్ :
2.25/5
చివరి మాట :
పెద్ద ఎక్స్పెక్టేషన్స్ లేకుండా, ఏదో రొటీన్ గా ఉన్న.. కాస్త కామెడీ ఉండే మూవీ చాలు అనుకుంటే ఈ మూవీ కచ్చితంగా నచ్చుతుంది.
watch trailer :
ALSO READ : యష్ మొదలు మృణాల్ ఠాకూర్ వరకు.. సీరియల్స్ నుండి సినిమాల్లోకి వచ్చిన 10 మంది నటులు వీళ్ళే..!