BIG BREAKING : ఆస్పత్రిలో చేరిన కేసీఆర్… అర్ధరాత్రి రెండున్నర గంటల సమయంలో..? అసలు ఏం జరిగిందంటే..?

Ads

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ని యశోద ఆసుపత్రిలో చేర్చారు. అర్ధరాత్రి రెండున్నర గంటల సమయంలో కేసీఆర్ ఎడమ కాలి తుంటి ఎముక విరిగింది. ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో అర్ధరాత్రి కాలికి పంచె తగలడంతో కేసీఆర్ కాలుజారి పడ్డారు. ఈ సంఘటన అర్ధరాత్రి రెండున్నర సమయంలో జరిగింది. దాంతో కుటుంబ సభ్యులు కేసీఆర్ ని సోమాజిగూడలో ఉన్న యశోద ఆసుపత్రిలో చేర్పించారు.

Ads

ప్రస్తుతం డాక్టర్లు కేసీఆర్ కి చికిత్స అందిస్తున్నారు. రాత్రి డాక్టర్లు కొన్ని టెస్టులు చేశారు. ఇవాళ ఉదయం 10 గంటల తర్వాత మరికొన్ని టెస్టులు చేస్తారు అని సమాచారం. ఇవన్నీ చూసి పరిశీలించిన తర్వాత కేసీఆర్ కాలికి సర్జరీ చేయాలా? వద్దా? అని నిర్ణయం తీసుకుంటారు. ప్రస్తుతం కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. ఈ విషయంపై పూర్తి వివరాలు ఇంకా రావాల్సి ఉంది. ప్రస్తుతం కేసీఆర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

Previous articleక్లైమాక్స్ లో హీరో చనిపోవడం వల్లే ఈ 5 సినిమాలు ఫ్లాప్ అయ్యాయా.?
Next articleEXTRA-ORDINARY MAN REVIEW : నితిన్ నటించిన ఈ సినిమా ఆకట్టుకుందా..? స్టోరీ, రివ్యూ & రేటింగ్!