ముందు ప్రమోషన్స్.. ఇప్పుడు సక్సెస్ సెలెబ్రేషన్స్..? అసలు ఈ నందమూరి హీరో సినిమా ఎప్పుడు వచ్చింది..?

Ads

నట సార్వ భౌమ నందమూరి తారక రామారావు కుటుంబం నుండి మరో వారసుడు హీరోగా తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు. ఎన్టీఆర్‌ కుమారుడు జయకృష్ణ తనయుడు చైతన్య కృష్ణ హీరోగా నటించిన  ‘బ్రీత్‌’ మూవీ తెరకెక్కింది. ఈ చిత్రానికి ‘వైద్యో నారాయణో హరి’ అనేది ట్యాగ్ లైన్.

వంశీకృష్ణ ఆకెళ్ల ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. ఈ మూవీ ఫ‌స్ట్ లుక్ ను నందమూరి బాల‌కృష్ణ  లాంచ్ చేశారు. ఇటీవల రిలీజ్ అయిన బ్రీత్ సినిమా సక్సెస్ సెలెబ్రేషన్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
జ‌య‌కృష్ణ కుమారుడు చైత‌న్య కృష్ణ‌ను హీరోగా నటించిన బ్రీత్ సినిమాని, బ‌స‌వ‌తార‌కం క్రియేష‌న్స్ ప‌తాకం పై జ‌య‌కృష్ణ నిర్మించారు. ఈ మూవీ ఫ‌స్ట్‌లుక్, ట్రైలర్ కు మంచి స్పందన వచ్చింది. ర‌క్ష‌, జ‌క్క‌న చిత్రాల ద‌ర్శ‌కుడు వంశీకృష్ణ ఆకెళ్ల‌ దర్శకత్వం వహించారు. మార్క్ కె రాబిన్ సంగీతాన్ని సమకూర్చారు. క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రంలో సెంజలియా, కేశవ్ దీపక్, వెన్నెల కిషోర్, జబర్దస్త్ అప్పారావు, భద్రమ్, షేకింగ్ శేషు వంటి వారు ఇతర కీలక పాత్రలలో నటించారు.

Ads

ఈ సినిమా కథ విషయానికి వస్తే, అభి(చైత‌న్య కృష్ణ‌) పేషెంట్‌గా హాస్పిటల్‌లోకి ప్రవేశిస్తాడు. ముఖ్యమంత్రి, పీపుల్స్ పార్టీ వ్యవస్థాపక ప్రెసిడెంట్ ఆదిత్య వర్మ కుప్పకూలి పడిపోవడంతో బ్రీత్ హాస్పటల్ కి తీసుకువెళతారు. హాస్పిటల్‌లో చేరిన ముఖ్యమంత్రిని అభి కాపాడతాడు. అయితే నిందితుల ముఖ్యమంత్రిని చంపాలనుకున్న దుండగుల నుండి అభి ఎలా కాపాడాడు అనేది సినిమా మిగిలిన కథ.
ఈ చిత్రం డిసెంబర్ 2న రిలీజ్ అయ్యింది. ఈ మూవీ రిలీజ్ కు ముందు ప్రమోషన్స్ కూడా పెద్ద ఎత్తున నిర్వహించారు. ప్రీరిలీజ్ ఈవెంట్ కూడా నిర్వహించారు. కానీ ఈ మూవీ రిలీజ్ అయిన విషయం చాలామందికి తెలియాదు. తాజాగా ఈ మూవీ సక్సెస్ సెలెబ్రేషన్స్ సంబంధించిన వీడియో సోషల మీడియాలో వైరల్ గా మారింది. దీనిని చూసినవారు ఈ మూవీ ఎప్పుడు రిలీజ్ అయ్యిందా అని కామెంట్స్ చేస్తున్నారు.

Previous articleముందు ఉద్యమం… తర్వాత లాయర్… ఇప్పుడు తెలంగాణ మంత్రి..! సీతక్క ప్రజాప్రస్థానం గురించి తెలుసా..?
Next articleతెలంగాణ కొత్త IT మినిస్టర్ అయ్యేది ఈ నాయకుడేనా..? మదన్ మోహన్ రావు గురించి ఈ విషయాలు తెలుసా..?
Hai this is Kavitha. Cover the media industry. I write on the Movies, TV channels, OTT platforms and anything that is a medium for content distribution.