పాకిస్థాన్ 3000 బాంబులతో అటాక్ చేసినా ఒక్క గీత పడని ఆలయం.. ఎక్కడ ఉందంటే..?

Ads

భారత దేశంలో వందల ఏళ్ల చరిత్ర కలిగిన ఎన్నో హిందూ ఆలయాలు ఉన్నాయి. పురాతన ఆలయాల్లో  తనోత్ మాత గుడి కూడా ఒకటి. ఈ దేవాలయం పశ్చిమ రాజస్థాన్ లో జైసల్మేర్ జిల్లాలో వుంది. జగన్మాత ఎన్నో రూపాలలో భక్తులను కాపాడుతూ ఉంటుంది.

ఈ ఆలయంలో తన్నోట్ మాత రూపంలో దర్శనం ఇస్తుంది. అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటి అయిన  బలోచిస్తాన్లో అవతరించిన హింగ్లాస్ మాత మరో రూపమే ‘తనోత్ మాత’ అంటూ చరణ్ సాహిత్యం చెబుతోంది. అయితే ఈ గుడికి ఎంతో చరిత్ర ఉంది. పాకిస్థాన్ ఈ గుడి పైన 3 వేల బాంబులతో దాడి చేయగా. కొంచెం కూడా ఆలయం చెక్కుచెదరలేదని తెలుస్తోంది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..1965 ఇండో-పాక్ యుద్ధం జరిగిన సమయంలో, పాకిస్థాన్ ఇండియాలోని ఈ భాగాన్ని సొంతం చేసుకోవాలనే ఉద్దేశ్యంతో భారీ బాంబు దాడులు చేసింది. తనోత్ మాత గుడి పై నవంబర్ 17 నుంచి 19 వరకు బాంబులతో అటాక్ చేసింది. పాక్ ఫిరంగులు దాదాపు మూడువేల బాంబులు వేసింది. కానీ ఈ ఆలయం పై ఒక్క గీత అయినా పడలేదు. ఇక ఆలయ ప్రాంగణంలో పడిన 450 బాంబులు సైతం పేలలేదు.
ఇలా జరగడానికి కారణం తనోత్ మాతా ఆశీస్సులే అని అక్కడివారు నమ్ముతారు. ఆ యుద్ధ సమయంలో, తనోత్ రాయ్ మాత ఆలయాన్ని కాపాడడానికి మేజర్ జై సింగ్ ఆధ్వర్యంలో 13 గ్రెనేడియర్‌ల కంపెనీతో పాటు బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అంతా శత్రువుల దాడులను ఎదుర్కొన్నాయి. అప్పటి వరకు ఈ ప్రదేశం గురించి ఎవరికీ తెలియదు. అయితే యుద్ధం తర్వాత ఈ ప్రాంతం ప్రసిద్ధి చెందింది. అప్పటివరకు భద్రతా దళాలకు రక్షణగా ఉన్న ఈ ఆలయానికి, యుద్ధం తర్వాత భద్రతా దళాలు ఆలయ కవచంగా మారింది. గుడిని బీఎసెఎఫ్ ఆధీనంలోకి తీసుకుంది.
ఈ ఆలయ నిర్వహణ అంతా సరిహద్దు భద్రతా దళం చూసుకుంటోంది. గుడి లోపల మ్యూజియం కూడా ఉంది. ఈ గుడి పై వేసిన 3 వేల బాంబుల్లో పేలకుండా ఉన్న బాంబులను సేకరించి ఈ మ్యూజియంలో భద్రపరిచారు. ఇక ఈ ఆలయ పూజారి సైతం సైనికుడే.

Ads

Also Read: “ఇలాంటి అన్న ప్రసాదం పెట్టడం ఏంటి..?” అంటూ… తిరుమలలో భక్తుల ఆగ్రహం..! ఏం జరిగిందంటే..?

Previous articleహీరోయిన్ అవ్వాలని ప్రయత్నిస్తూ ఉంటుంది… కానీ అంతలోపు..? ఈ సినిమా చూశారా..?
Next article“రణవీర్ సింగ్” తో పాటు… “దీపిక పదుకొనే” ప్రేమించిన 8 మంది సెలెబ్రిటీలు ఎవరో తెలుసా..?
Hai this is Kavitha. Cover the media industry. I write on the Movies, TV channels, OTT platforms and anything that is a medium for content distribution.