సినిమా రంగంలో సక్సెస్ అయిన సరిత నిజ జీవిత కథ గురించి తెలుసా..? 16 సంవత్సరాలకే..?

Ads

మనకు స్పోర్ట్స్ లో మాత్రమే ఆల్ రౌండర్స్ ఉంటారు అన్న విషయం తెలుసు.. అయితే సినీ ఇండస్ట్రీలో కూడా ఆల్ రౌండర్స్ ఉంటారు అని మనం అనుకోము. అలాంటి ఒక లేడీ ఆల్ రౌండర్ హీరోయిన్ సరిత. ఆమె స్క్రీన్ పై కనిపిస్తే చూపు తిప్పడం అంత ఈజీ కాదు సుమ.. నటనతో ,హావభావాలతో ప్రేక్షకులను కట్టిపడేయడం సరితకు వెన్నతో పెట్టిన విద్య.

అంత గొప్ప నటి అయిన సరిత.. 1980 దశకంలో తెలుగు తోపాటు దక్షిణాది పలుభాషలను స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగింది. అయితే ఆమె జీవితం పూల పాన్పు కాదు.

actor sarita

సుమారు 500కు పైగా చిత్రాల్లో హీరోయిన్ గా నటించి.. ఆ తర్వాత డబ్బింగ్ ఆర్టిస్ట్ గా కూడా చేయడానికి సరిత వెనుకాడ లేదు. అందరూ సరిత తమిళ్ హీరోయిన్ అనుకుంటారు కానీ ఆమె అచ్చంగా తెలుగింటి అమ్మాయి. గుంటూరు మునిపల్లెలో జన్మించిన సరిత మొదట చిత్రం నిజానికి మంచికి స్థానం లేదు. అయితే ఆమె నటించిన ఇంకొక చిత్రం మరోచరిత్ర మొదట రిలీజ్ కావడంతో అదే ఆమె ఫస్ట్ మూవీ కింద అందరూ భావిస్తారు. ఈ మూవీలో ఆమె నటనకు అందరూ ఫిదా అయ్యారు. ఆ తరువాత తమిళ్ లో బోలెడన్ని ఆఫర్లు కూడా వచ్చాయి.

Ads

actor sarita

1988లో తన తోటి మలయాళీ నటుడు ముఖేష్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది సరిత. వీళ్లకు ఇద్దరు శ్రవన్, తేజస్ అనే కొడుకులు. కొన్నాళ్లు సజావుగా సాగిన సంసారం విభేదాల కారణంగా విడాకుల వరకు వెళ్ళింది. 2013 లో వీరికి కోర్టు విడాకులు మంజూరు చేసింది. అనంతరం ముఖేష్ .. మిధుల అనే అమ్మాయిని పెళ్లి చేసుకోగా.. సరిత తన కొడుకుతో దుబాయ్ వెళ్లిపోయింది.

actor sarita

తర్వాత కొంతకాలానికి సినిమాల్లో రీఎంట్రీ ఇచ్చి తల్లి పాత్రలు అత్త పాత్రలు చేయడంతో పాటు పలు హిట్ మూవీలకు డబ్బింగ్ కూడా చెప్పింది సరిత. అయితే ఈమెకు సంబంధించిన మరొక వార్త లేటెస్ట్ గా వైరల్ అవుతుంది. 16 సంవత్సరాల వయసులో సరితకు తెలుగు నటుడు వెంకటసుబ్బయ్యతో పెళ్లి ఆ తర్వాత ఆరు నెలలకి వీళ్ళు విడిపోయినట్లు తెలుస్తుంది.

Previous articleWPL AUCTION: మహిళల ఐపీఎల్ లో 10 లక్షల నుండి 1.3 కోట్లకు…ఇంతకీ ఎవరు ఈ వృందా దినేశ్?
Next article“బాలయ్య”తో నటించడానికి మూడు సార్లు “నో” చెప్పిన హీరోయిన్…15 ఏళ్ల క్రితం కలిసి నటించారు కానీ.?
Hi, This is Harika. I have been working as a web content writer in PRATHIDVANI from the past one year and am experienced in writing articles in cinema, sports, inspiring stories and flash news categories.