“హాయ్ నాన్న” సినిమాలో జరిగినట్టే వీళ్ళకి కూడా జరిగిందా..? ఈ వ్యక్తి పోస్ట్ చూస్తే కన్నీళ్లు ఆగవు..!

Ads

సినిమాలు చాలా వరకు నిజ జీవిత సంఘటనల నుండే తీసుకొని చేస్తారు. అందులోనూ ముఖ్యంగా ఎమోషన్స్ ఎక్కువగా ఉన్న సినిమాలు అయితే నిజ జీవితంలో ఎక్కడో జరిగిన సంఘటనలని ఆధారంగా తీసుకొని చేస్తారు. కొన్ని సినిమాలు చూస్తే మనకి మనం రిలేట్ అవుతాం.

వారిలో మనల్ని మనం చూసుకుంటాం. అలా ఇటీవల వచ్చిన సినిమా హాయ్ నాన్న సినిమాతో చాలా మంది తల్లిదండ్రులు, లేదా వ్యక్తులు ఆ సినిమాలో ఉన్న పాత్రలకి ఏదో ఒక విధంగా కనెక్ట్ అయ్యారు. అలా ఈ సినిమా తన నిజ జీవితానికి దగ్గరగా ఉంది అంటూ ఒక వ్యక్తి సినిమా చూసిన తర్వాత చేసిన పోస్ట్ కంటతడి పెట్టిస్తోంది.

hi nanna review

సినిమా చూసిన తర్వాత విహాన్ కృష్ణ అనే అకౌంట్ నుండి సినిమా బృందాన్ని అభినందిస్తూ, తన కథని చెబుతూ ఒక వ్యక్తి ఈ విధంగా పోస్ట్ చేశారు. ఆ వ్యక్తి తన పోస్ట్ లో ఇలా రాశారు. “మూవీలో 10 పర్సెంట్ వదిలేస్తే డిట్టో మా స్టోరీ లాగానే ఉంది. CF (సినిమాలో చూపించిన లంగ్స్ కి సంబంధించిన సమస్య) కాకుండా మా పర్సనల్ లైఫ్ కూడా విరాజ్, యష్న మధ్య ప్రేమ, పెళ్లి, పాప బర్త్, హాస్పటల్ సీన్స్, మొత్తం మా లైఫ్ లో జరిగినాయి. వాళ్ల మధ్య కార్ లో ఉన్న సంభాషణలు అయితే ఎన్నో సార్లు నేను సాయికిరణ్ తో అన్నాను.”

hi nanna review

“మనం కలవకుండా ఉండాల్సింది వాడికి ఈ కష్టం వచ్చేది కాదు ఏమో అని. యష్న పర్సనల్ లైఫ్ సీన్స్ కొన్ని సేమ్. లిటరల్లీ మా ముగ్గురిని స్క్రీన్ మీద చూసుకున్నట్టే ఉంది. స్టార్టింగ్ లో బెడ్ టైం స్టోరీ, బ్యాక్ గ్రౌండ్ లో ఆక్సిజన్ మిషన్, మెడిసిన్ బాక్స్, కేక్ తినొద్దు అనడం, హఫ్ పఫ్ విత్ ఇన్హేలర్‌, మొక్కలు తీసేయడం, పెట్ ని రూమ్ లోకి రావొద్దు అనడం, మహి పడుకున్నాక ఇల్లంతా క్లీన్ చేయడం నన్ను నేను చూసుకున్నట్టు అనిపించింది (ఈ సీన్స్ అన్ని ఒక CF పేరెంట్ కి మాత్రమే అర్థం అవుతాయి ఇవన్నీ ఎంత ఇంపార్టెంట్ మా లైఫ్ లో అని).”

Ads

netizen emotional post on hi nanna

“మహి బయట వాటర్ తాగను వార్మ్ వాటర్ తాగుతా అనగానే విహాన్ మాట్లాడినట్టు అనిపించింది సెకండ్ హాఫ్ సీన్స్, మహి స్పెషల్ బర్త్ డే కేక్ ఇంకా చాలా ఉన్నాయి మూవీలో కనెక్ట్ అయ్యేది. విరాజ్ పాపని చూస్తూ ఉన్న ప్రతి సారి నాకు విహాన్ కళ్ళముందు కనపడ్డాడు. హాస్పిటల్ ఎమర్జెన్సీ సీన్స్ డాక్టర్స్ మాటలు అన్ని కళ్ళముందు ఒక్కసారిగా ఫ్లాష్ అయినాయి. NICU ముందు డైలాగ్స్ అయితే సేమ్. సిస్టిక్ ఫైబ్రోసిస్ (CF) కేస్ అన్నా అని డాక్టర్స్ మాట్లాడుతుంటే నాకు మా విహాన్ ని చూసే డాక్టర్స్ టీం గుర్తొచ్చారు. చాలా పర్సనల్ గా కనెక్ట్ అయిపోయా మూవీ కి మాత్రం.” అంటూ రాశారు.

netizen emotional post on hi nanna

అంతే కాకుండా 65 రోజెస్ ని చూపించడం కూడా చాలా బాగా చూపించారు అని, ఈ సినిమా తీసినందుకు దర్శకుడికి, ఈ సినిమాలో పాపకి తండ్రిగా ఒక CF పేరెంట్ గా నటించినందుకు నానిని కూడా అభినందించారు. ఈ పోస్ట్ కి దర్శకుడు శౌర్యువ్ స్పందిస్తూ, “ఏం టైప్ చేయాలో తెలియట్లేదు అండి. మీ కుటుంబానికి ఇది కనెక్ట్ అయినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. మీ పరిస్థితి ఎలా ఉందో నేను అర్థం చేసుకోగలను. ఈ పోస్ట్ చేసినందుకు థాంక్యూ.”

netizen emotional post on hi nanna

“మా టీం విహాన్ ని తొందరలోనే కలుస్తారు. మనం పర్సనల్ గా మాట్లాడుకుందాం. విహాన్, మీలాంటి వారియర్స్ ని కలవడానికి నేను ఎదురు చూస్తున్నాను” అని రాశారు. ఈ పోస్ట్ చదివిన ప్రతి వాళ్లు కూడా విహాన్ కృష్ణ ఎకౌంట్ నుండి వచ్చిన ఈ పోస్ట్ కి కామెంట్స్ పెడుతున్నారు. ఇదంతా చూస్తూ ఉంటే హాయ్ నాన్న దర్శకుడు శౌర్యువ్ ఈ సినిమా కోసం ఎంత వర్క్ చేసి, దాని గురించి ఎంత తెలుసుకొని సినిమా తీశారో అర్థం అవుతోంది.

ALSO READ : లేడీ సూపర్ స్టార్ సినిమా ఇంత సైలెంట్ గా రిలీజ్ అయ్యిందా..? ఎలా ఉందంటే..?

Previous articleజగన్ చెప్పింది కరెక్టేనా..? అసలు విషయం ఏంటంటే..?
Next article“ఇలాంటి సీన్స్ పెట్టడం అవసరమా..?” అంటూ… నితిన్ “ఎక్స్‌ట్రా – ఆర్డినరీ మ్యాన్” మూవీ మీద కామెంట్స్..!