Ads
వెండితెరపై హీరోయిన్ గా చేసేవారు మంచి అందం అభినయం కనబరిస్తే ఫాన్స్ గుండెల్లో పెట్టేసుకుంటారు. చాలా మంది తమ కలల దేవతగా పూజిస్తారు. డ్రీమ్ గర్ల్ అంటూ, తమ క్రష్ అంటూ ఏవేవో పేర్లు పెట్టుకుని ఆరాధిస్తూ ఉంటారు. ఇప్పుడంటే సెల్ ఫోన్స్ వచ్చేసాయి కాబట్టి తమకి నచ్చిన హీరోయిన్ ఫోటోలను స్టోర్ చేసుకోవటమో, లేకపోతే వాల్ పేపర్ గా పెట్టుకోవడం జరుగుతుంది.
అదే గతంలో 90’s లో అయితే తమకు నచ్చిన హీరోయిన్ ఫోటోలను తీసుకొచ్చిన ఇంట్లో గోడలకు అతికించి మరి పూజించేవారు. లేదా పేపర్ కటింగ్స్ ని చాలా భద్రంగా దాచుకుని చూస్తూ మురిసిపోయేవారు. అప్పటి హీరోయిన్స్ కూడా అభిమానులను అలరించడానికి మంచి మంచి పాత్రలు చేస్తూ వారికి దగ్గరయ్యేవారు.
అలా ఒకప్పుడు సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా వెలుగొందింది నటి హీరా.1990 లో తన అంద చందాలతో కుర్రకారు మనసు దోచేసింది. తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో పలు సినిమాలు చేసింది. ఈ ముద్దుగుమ్మ తెలుగులో ఆవిడా మా ఆవిడే, లిటిల్ సోల్జర్స్, ఆహ్వానం లాంటి సినిమాల్లో నటించింది. తమిళంలో హృదయం, నీ బడి నాన్ బడి, తిరుడా తిరుడా, సతిలేలావతి, కాదల్ కొట్టో, అవ్వై షణ్ముఖి లాంటి చిత్రాల్లో నటించి ఫేమస్ అయింది.
Ads
ముఖ్యంగా హార్ట్ సినిమాలోని “పోతువైత ఒరు వత్త నిల” పాట సన్నివేశంలో హీరా నటన ఆనాటి అభిమానుల హృదయాలను దోచేసింది. తర్వాత 2002 సంవత్సరంలో పుష్కర్ మాధవ్‌ను పెళ్లాడిన హీరా.. 2006లో పలు వ్యక్తిగత కారణాలతో విడాకులు తీసుకుంది. తాజాగా హీరా తన ఫోటోలను షేర్ చేసింది. అభిమానులు ఇది ఆమెనా అని ఆశ్చర్యపోతున్నారు. ఒకప్పుడు కుర్రాలను అలరించిన హీరా ఇప్పుడు ఇలా మారిపోయింది ఏంటి అంటూ షాక్ కి గురవుతున్నారు.
అంద అనేది ఎప్పుడు ఒకేలా ఉండదు. వయసు పెరిగే కొద్దీ మనిషిలో రూపు రేఖలు మారుతూ వస్తూ ఉంటాయి. అందుకే అందం అభినయం అనేవి ఉన్నప్పుడే బాగుంటాయి. మనిషి వ్యక్తిత్వం అనేది ఎప్పుడూ ఒకేలా ఉండాలి. దాన్నిబట్టి మన జీవితం అందంగా ఉంటుంది. అందాన్ని చూసి మురిసిపోకూడదు అనేదానికి హీరోయిన్ల జీవితాలే ఒక ఉదాహరణ. ఏదిఏమైనా హీరా అలనాటి అందాల తారగా ఏప్పటికీ కుర్రాళ్ళ గుండెల్లో ముద్ర వేసుకుని ఉంటుంది.