Ads
దేవాలయాలకి వెళ్ళిన సమయంలో ప్రదక్షిణ చేస్తారనే విషయం తెలిసిందే. అయితే అన్ని దేవాలయాలలో చేసే ప్రదక్షిణ ఒకలా ఉంటే, శివాలయంలో చేసే ప్రదక్షిణ విధానం వేరుగా ఉంటుంది.
ఇతర దేవాలయాలలో చేసినట్లుగా ఈశ్వర ఆలయంలో ప్రదక్షిణ చేయకూడదని పండితులు చెబుతున్నారు. మరి శివుని గుడిలో ఎలా ప్రదక్షిణ చేయాలో, ఆ విధంగా ప్రదక్షిణ చేయడం వల్ల ఎటువంటి ఫలితాలు పొందుతారో ఇప్పుడు చూద్దాం..
ఏ దేవాలయానికి వెళ్ళినా ప్రదక్షిణ చేయడం అనేది సర్వ సాధారణం. అయితే శివాలయానికి ఒక ప్రత్యేకత ఉందని పండితులు చెబుతున్నారు. ఇతర అలాయాలలో మాదిరిగా పరమేశ్వరుని గుడిలో ప్రదక్షిణ చేయకూడదట. శివుని గుడిలో ఏ విధంగా ప్రదక్షిణ చేయాలనే విషయం గురించి లింగ పురాణంలో స్పష్టంగా ఉందని పండితులు చెబుతున్నారు.
శివుని గుడిలో చేసే ప్రదక్షిణను సోమసూత్ర ప్రదక్షిణ లేదా చండి ప్రదక్షిణ అని అంటారు. శివాలయంలో ధ్వజస్తంభం దగ్గర ప్రదక్షిణ మొదలుపెట్టి, సోమసూత్రం (శివుని అభిషేకజలం బయటకు పోయే మార్గం) వరకు వెళ్ళి, మళ్ళీ తిరిగి వెనక్కి, ధ్వజస్తంభం వరకు వెళ్ళి, మళ్ళీ అక్కడి నుండి సోమ సూత్రం, ధ్వజస్తంభం వరకు వెళ్ళాలి. ఇలా చేస్తే శివాలయంలో ఒక ప్రదక్షణ చేసినట్లు. సోమసూత్రం దాటారాదు. అక్కడ ప్రమధ గణాలు కొలువై ఉంటారు. అందువల్ల ప్రమధ గణాలను దాటితే శంకరుని ఆగ్రహానికి గురి అవుతారట.
ఈ విధంగా చేసే ప్రదక్షిణం సాధారణంగా చేసే 10 వేల ప్రదక్షిణాలకి సమానమని లింగ పురాణంలో చెప్పబడిందట. ఈ విధంగా 3 ప్రదక్షిణలు చేయాలి. కానీ నందీశ్వరుడికి, పరమేశ్వరునికి మధ్యలో మాత్రం అసలు నడవకూడదు. దానికి కారణం నంది చూపులు ఎల్లప్పుడు శివుడి పైనే ఉంటాయి. అందువల్ల ఆయన దృష్టికి అడ్డుగా వెళ్ళకూడదు. నందీశ్వరుడి వెనుక నుండి వెళ్లాలి. అంతేకాకుండా శివుని విగ్రహానికి ఎదురుగా నిలుచుని దర్శనం చేసుకోకూడదట. దేవుడి విగ్రహం నుంచి వచ్చే శక్తి తరంగాలు నేరుగా ఎదురుగా ఉన్నవారి పై పడతాయి. వాటి శక్తి మనుషులు భరించలేరు కాబట్టి విగ్రహం పక్కన నిలుచుని దర్శించుకోవాలని సూచిస్తున్నారు.
Ads
Also Read: పాకిస్థాన్ 3000 బాంబులతో అటాక్ చేసినా ఒక్క గీత పడని ఆలయం.. ఎక్కడ ఉందంటే..?