కర్ణాటకలో లాగే తెలంగాణ ఆటో డ్రైవర్ల పరిస్థితి మారుతుందా..? ఓ ఆటో డ్రైవర్ ఎదురుకున్న పరిస్థితి ఇది.!

Ads

తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎలెక్షన్స్ కు ముందు ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలుకు శ్రీకారం చుట్టింది. వీటిలో ముందుగా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణంను అందుబాటులోకి తెచ్చిన విషయం తెలిసిందే.

representative image

శనివారంనాడు సీఎం రేవంత్ రెడ్డి మహాలక్ష్మి స్కీమ్ లో భాగంగా మహిళలకు ఉచిత బస్ సౌకర్యాన్ని మొదలుపెట్టారు. ఈ స్కీమ్ కు మహిళల నుండి విశేష స్పందన వస్తోంది. బస్సులలో మహిళ సంఖ్య పెరిగి, బస్టాండ్లలో రద్దీ పెరిగింది. అయితే తెలంగాణ ఆటో డ్రైవర్ల పరిస్థితి కూడా కర్ణాటక ఆటో డ్రైవర్లలాగే మారుతుందని అంటున్నారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..

Ads

ఈ ఏడాది మేలో కర్ణాటక‌ అసెంబ్లీ ఎలెక్షన్స్ జరిగి, కాంగ్రెస్ గెలిచి అధికారంలోకి వచ్చింది. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీల నేపథ్యంలో కర్ణాటక‌ ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు సర్వీసు స్కీమ్ ప్రవేశపెట్టింది. ఆ పథకానికి మహిళల నుండి భారీ స్పందన రావడంతో అక్కడి బస్సులలో రద్దీ పెరిగింది. అయితే అక్కడ ఆటో డ్రైవర్ల పై ఈ పథకం ప్రతికూల ప్రభావం చూపించింది.
ప్రభుత్వం తెచ్చిన ఉచిత బస్సు ప్రయాణం ఆటో డ్రైవర్ల ఉపాధి పై దెబ్బకొట్టింది. కస్టమర్లు ఆటోలు ఎక్కక, రోజంతా ఆటో నడిపినా డబ్బులు ఆశించినమేర రాక వారు ఆర్ధికంగా ఇబ్బంది పడుతున్నారు. బెంగళూరులో పనిచేసే ఆటోడ్రైవర్ మాట్లాడుతూ 5 గంటలు కష్టపడితే రూ.40 మాత్రమే వచ్చినట్టు చెప్తూ కన్నీరు పెట్టుకున్న వీడియో అప్పట్లో నెట్టింట్లో వైరల్‌ అయ్యింది.
తాజాగా తెలంగాణలో కూడా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం అమలులోకి రావడంతో ఎక్కువ మంది మహిళలు ఆర్టీసీ బస్సులు ఎక్కడానికే ఆసక్తి చూపుతున్నారు. దీనివల్ల మెట్రో ట్రైన్, ఆటోలు ఎక్కే మహిళలు తక్కువ అయ్యారు. బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం వల్ల తమ బతుకు దెరువు దెబ్బతింటుందని, తమ కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి వస్తుందని ఆటో డ్రైవర్లు ఆందోళన పడుతున్నారు. కర్ణాటక ఆటో డ్రైవర్ల లాగే తమకు కూడా జరుగుతుందా అనే ఆందోళన చెందుతున్నారు.

Also Read: తాళి కట్టే సమయానికి ఇలా చేయడం ఏంటి..? సినిమాని తలపిస్తున్న సంఘటన..!

 

Previous articleBrahmamudi Serial: కావ్య ని బ్లెయిమ్ చేస్తున్న అనామిక పేరెంట్స్.. పండగ చేసుకుంటున్న రుద్రాణి, రాహుల్!
Next article90’s లో కుర్రాళ్ళ కలల దేవత… ఇప్పుడు ఇలా మారిపోయింది.! ఎవరో గుర్తుపట్టారా.?
Hai this is Kavitha. Cover the media industry. I write on the Movies, TV channels, OTT platforms and anything that is a medium for content distribution.