Ads
కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ పరిధిలో మహిళలందరూ కూడా ఆర్టీసీ బస్సులలో ఉచితంగా ప్రయాణం చేసే వెసులుబాటు కల్పిస్తాము అంటూ ఎన్నికల ప్రచారంలో తెలియజేశారు. అయితే ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన మాట ప్రకారమే మహాలక్ష్మి పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమలులోకి తీసుకువచ్చారు. దీంతో డిసెంబర్ 9వ తేదీ మధ్యాహ్నం నుంచి ఈ పథకం అమలులోకి రావడంతో మహిళలందరూ కూడా ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణం చేస్తున్నారు.
ఈ విధంగా మహిళలు పెద్ద ఎత్తున ఆర్టీసీలో ప్రయాణం చేస్తున్నారని అధికారులు వెల్లడించారు. ఇదివరకు మహిళలు బస్సులలో ప్రయాణించిన విధంగా ఈసారి ప్రయాణిస్తున్నారని అధికారులు వెల్లడించారు అయితే వరంగల్ జిల్లాలోని మహిళలు సరికొత్త రికార్డు స్పటించారని తెలుస్తుంది.వరంగల్ రీజియన్ పరిధిలో ప్రతిరోజు సగటున రెండు లక్షల పైగా మహిళలు ప్రయాణం చేస్తున్నట్లు అధికారులు తెలియజేశారు.
Ads
9వ తేదీ మధ్యాహ్నం 2 గంటల నుంచి అర్దరాత్రి వరకు 94,128 మంది మహిళలు జీరో టికెట్ పై ప్రయాణం చేశారు. ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి ఈ ప్రయాణాన్ని మహిళలు ఎంతో అద్భుతంగా సద్వినియోగం చేసుకుంటున్నారని తెలుస్తుంది. ఈ స్కీమ్ లో భాగంగా మహిళలు పెద్దయిన పుణ్యక్షేత్రాలను సందర్శిస్తుండటం విశేషం.
వరంగల్ ఉమ్మడి జిల్లా నుంచి ఎక్కువగా హైదరాబాద్‌తో పాటు వేములవాడ, కాలేశ్వరం వివిధ పుణ్యక్షేత్రాలకు వెళ్లే రూట్లలో ప్రయాణం చేసినట్లుగా ఆర్టీసీ అధికారులు తెలియచేశారు. ఇలా ఉచిత ప్రయాణాన్ని కూడా మహిళలు దైవదర్శనానికి ఉపయోగిస్తున్నారు అని అధికారులు తెలియజేయడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఏదీ ఏమైనా ఉచిత ప్రయాణం అంటే మహిళలకు కూడా పెద్ద ఎత్తున దైవభక్తి ఎక్కువ అవుతుంది అంటూ పలువురు ఈ విషయంపై కామెంట్ చేస్తున్నారు.