Ads
ఏడాది నుంచి క్రికెట్ కి దూరమై.. సర్జరీ తర్వాత టీంలోకి తిరిగి రావడానికి ఎంతో కష్టపడుతున్న ప్లేయర్ రిషబ్ పంత్. సర్జరీ తర్వాత నడవడమే కష్టం అన్న పరిస్థితి నుంచి పరుగులు పెట్టే విధంగా కోలుకున్నాడు ఈ ఆటగాడు. ఫిబ్రవరి లోపు తన సత్తా చాటుకుని పూర్తి ఫిట్నెస్ సాధించే విధంగా అతను ప్రయత్నాలు చేస్తున్నాడు. వచ్చే సంవత్సరం జరిగే టి20 ప్రపంచ కప్ టీం లో స్థానం సంపాదించుకోవాలి అని పంత్ చాలా తపన మీద ఉన్నాడు.
Ads
ఢిల్లీ క్యాపిటల్స్ కూడా అతనిపై ఎంతో ఆశలు పెట్టుకొని ఉంది. వచ్చే సీజన్ కు పంత్ ఆ టీం కి కెప్టెన్ గా ఉంటాడు అని ఇప్పటికే ఆ జట్టు మేనేజ్మెంట్ ధ్రువీకరించింది. అయితే ఐపీఎల్ లో పాల్గొనాలా లేదా అన్న విషయం NCA నివేదికను బట్టి బీసీసీఐ నిర్ణయం తీసుకుంటుంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ క్యాపిటల్స్ మరొక సెకండ్ ప్లాన్ ని కూడా రెడీ చేసుకున్నట్లు తెలుస్తోంది. బీసీసీఐ అనుమతిస్తే వికెట్ కీపింగ్ చేయించే బాధ్యత పంత్ కు అప్పగించాలని.. లేదంటే కనీసం ఫీలింగ్ అన్న చేయించాలని ఆ టీం భావిస్తోంది.
ఇదే విషయాన్ని ఢిల్లీ ఫ్రాంచైజ్ అధికారులు.. అతను వికెట్ కీపింగ్ చేయలేకపోతే ఫీల్డర్ గా అయిన ముందుండి మైదానంలో జట్టును నడిపిస్తాడు అంటూ పేర్కొన్నారు. మరోపక్క ఇంపాక్ట్ ప్లేయర్ కింద పంత్ ను తీసుకునే ఛాన్స్ కూడా. ఇప్పటికే ఈ సంవత్సరం జనవరి నుంచి పంత్ టీమిండియా ఆడిన 62 మ్యాచ్‌లతో పాటు ఆఫ్ఘనిస్తాన్ లో జరగనున్న టి20 సిరీస్ లో కూడా పాల్గొనడం లేదు. మరి ఈ నేపథ్యంలో అతని ఫిట్నెస్ ఏ రకంగా ఉంటుందో చూడాలి.