Ads
సీరియల్ లో నటిస్తున్న నటీనటులని చూస్తే వాళ్ల జీవితాలు బాగా రిచ్ అని, ఇప్పుడు వాళ్లు అనుభవిస్తున్నదంతా అదృష్టం అని చాలామంది కుళ్లుకుంటారు. అయితే ఇప్పుడు అనుభవిస్తున్న సుఖాలు అంత సులువుగా రాలేదని దాని వెనుక కొన్ని సంవత్సరాల కృషి ఉంటుందని తెలుసుకోలేరు.
ఇప్పుడు అలాంటి ఒక నటి గురించి తెలుసుకుందాం. మౌనరాగం సీరియల్ ద్వారా తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ప్రియాంక జైన్ ఆ తర్వాత జానకి కలగనలేదు సీరియల్ తో మంచి పాపులారిటీని సంపాదించుకుంది.
ఇప్పుడు బిగ్ బాస్ లో కూడా స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా నిలబడి తన సత్తా చాటుతుంది. అలాంటి ప్రియాంక జైన్ ముంబైలో ఒక స్లమ్ జీవితాన్ని అనుభవించిందని ఎవరు ఎక్స్పెక్ట్ చేసి ఉండరు కానీ ముంబైలో ఆమె పుట్టి పెరిగిన ఇంటిని చూస్తే కన్నీరు పెట్టాల్సిందే. ముంబైలో ఉన్న ప్రియాంక ఇంటిని ఆమె బాయ్ ఫ్రెండ్ శివ్ హోమ్ టూర్ ద్వారా వీడియోలో బయటపెట్టాడు. ముంబైలో ఉన్న ప్రియాంక ఇల్లు ఒక చిన్న రూమ్ మాత్రమే అందులో 9 మంది కలిసి ఉండేవారు.
Ads
ఇది వాళ్ళ తాతయ్య, నానమ్మ సంపాదించుకున్న సంపాదన ఇందులోనే వారసులందరూ కలిసి ఉండేవారు. ముంబైలో వారు ఉండే ఇంటిని చౌల్ అంటారని ప్రియాంక చెప్పింది. అంటే ఒక స్లమ్ అని అర్థం. తన తల్లి తండ్రి ప్రేమించి లేచిపోయి పెళ్లి చేసుకున్నారు వాళ్ళిద్దరూ క్యూట్ కపుల్ అని చెప్పుకొచ్చింది. అలాగే 80 కుటుంబాలకి కలిపి రెండు బాత్రూములు మాత్రమే ఉండేవి. మా అమ్మ నాన్న అటకనే బెడ్ రూమ్ గా వాడుకునేవారు. మా బాబాయి వాళ్ళు ఇప్పటికీ అక్కడే ఉంటున్నారు అని చెప్పుకొచ్చింది.
ప్రియాంక సీరియల్స్ లోకి వచ్చిన తర్వాత ఆర్థిక పరిస్థితి కొంచెం మెరుగుపడింది. వాళ్ళ అమ్మగారు ఇప్పటికీ బ్యూటీషియన్ గా వర్క్ చేస్తున్నారు ఇప్పటికీ వాళ్ళ తల్లిదండ్రులు ఉండే ఇంటి అద్దే ప్రియాంకనే కడుతుంది వారి తండ్రి మాత్రం చాలా వ్యాపారాలు చేసి లాస్అయిపోయారు ఇప్పుడు వయసు రీత్యా ఏమి చేయలేరు అని చెప్పుకొచ్చాడు శివ్. ఈ విషయం తెలుసుకున్న నెటిజన్స్ ఆమె ఎలాంటి పరిస్థితుల్లోంచి వచ్చిందో తెలుసుకొని షాక్ అవుతున్నారు
watch video :
ALSO READ : చిన్న సినిమాగా రిలీజ్ అయ్యింది… ఇప్పుడు OTT లోకి కూడా వస్తోంది..! ఈ సినిమా చూసారా..?