ఫాలోయింగ్ లో అల్లు అర్జున్ నే దాటేసింది..! ఈ అమ్మాయి ఎవరంటే..?

Ads

ఇప్పుడు సోషల్ మీడియాని చూస్తుంటే బుర్ర హీటెక్కి పోతుంది. తెలిసి పెడతారో తెలియక పెడతారో తెలియదు కానీ కొన్ని పోస్టులు పిచ్చెక్కిస్తాయి.

అయితే అలాంటి పోస్టులే వైరల్ గా మారడం నేటి ట్రెండ్ అంటున్నారు నెటిజన్స్. కానీ చాలామంది సోషల్ మీడియాని వాడుకొని మంచి భవిష్యత్తుని నిర్మించుకుంటున్నారు.

this instagrammer has more following than heroes

సోషల్ మీడియా సామాన్య ప్రజలని సైతం స్టార్లుగా మార్చిన సంగతి అందరికీ తెలిసిందే. కొందరి సామాన్యుల ఫాలోవర్స్ ని చూస్తే మతి పోవాల్సిందే. అలాగే సంపాదన కూడా ఊహించని స్థాయిలో వస్తుంది. మారుమూల గ్రామాల నుంచి సైతం సోషల్ మీడియా ద్వారా లక్షలు సంపాదిస్తున్న సామాన్యులు చాలామంది ఉన్నారు. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే అమ్మాయి కూడా సోషల్ మీడియా ద్వారా డబ్బు సంపాదిస్తుంది.

this instagrammer has more following than heroes

Ads

ఇది అందరూ చేసేదే కదా అంటారేమో అయితే ఈమె సంపాదన ఎంతో తెలిస్తే మాత్రం నోరేళ్లపెట్టాల్సిందే. ఈ విషయంలో స్టార్ హీరోలైన షారుక్ ఖాన్, అమితాబచ్చన్, అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరోలను సైతం వెనక్కి నెట్టేసింది ఈ భామ. ఇంతకీ ఈమె ఎవరంటే జన్నత్ జుబేర్ రహ్మాని. ఈమె గురించి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా తెలియదు కానీ బాలీవుడ్ లో బాగా ఫేమస్ ఈ అమ్మాయి ఏడేళ్ళ వయసులోనే నటనలో అడుగుపెట్టి తర్వాత సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది.

this instagrammer has more following than heroes

కేవలం నటిగా మాత్రమే కాకుండా టిక్ టాక్ స్టార్ గా యాంకర్ గా సింగర్ గా చేసింది. ఈ 22 ఏళ్ల బ్యూటీ కేవలం సోషల్ మీడియా పోస్టులతోనే 25 కోట్లు సంపాదించింది. ఈ విషయంలో ఈమె స్టార్ హీరోలను సైతం వెనక్కి నెట్టేయడం గమనించాల్సిన విషయం. అలాగే ఈమె ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ 48 మిలియన్ల మంది. ఈ విషయంలో కూడా ఈమె స్టార్ నటి నటులను వెనక్కి నెట్టేసింది. నిజంగా ఈమె టాలెంట్ కి ఫిదా అవ్వాల్సిందే

Previous articleబాహుబ‌లి సినిమాలో భ‌ళ్లాలదేవుని ముఖం పై ఉన్న ఈ గాయం ఎలా అయ్యిందో గుర్తుందా?
Next articleREASONS FOR SEPARTATION OF HUSBAND AND WIFE:భార్యాభర్తలు విడిపోవడానికి ఇవే ప్రధాన కారణాల… వీటివల్లే విడిపోతున్నారా?
Hi, This is Harika. I have been working as a web content writer in PRATHIDVANI from the past one year and am experienced in writing articles in cinema, sports, inspiring stories and flash news categories.