Ads
ప్రస్తుతం తెలుగులో హర్రర్ చిత్రాల ట్రెండ్ కొనసాగుతుంది. థ్రిల్లర్ జానర్ లో వచ్చే చిత్రాలకు ప్రేక్షకులు బాగా కనెక్ట్ అవుతున్నారు. మొన్న వచ్చిన విరుపాక్ష, తాజాగా వచ్చిన పొలిమేర 2 చిత్రాలు మంచి టాక్ ను సొంతం చేసుకున్నాయి. ఇప్పుడు అదే తరహాలో పిండం అనే చిత్రం వచ్చింది. ఈ చిత్రం ప్రేక్షకులను భయపెట్టిందా లేదా అనేది రివ్యూ చూసి తెలుసుకుందాం…!
- నటీనటులు: శ్రీరామ్, ఖుషీ రవి, అవసరాల శ్రీనివాస్, ఈశ్వరీ రావు తదితరులు
- దర్శకత్వం: సాయికిరణ్ దైదా
- నిర్మాత: యశ్వంత్ దగ్గుమాటి
- మ్యూజిక్: కృష్ణ సౌరబ్ సూరంపల్లి
- సినిమాటోగ్రఫి: సతీష్ మనోహర్
- రిలీజ్ డేట్: 2023-12-15
కథ:
క్రిస్టియన్ మతానికి చెందిన ఆంథోని (శ్రీరామ్) రైస్ మిల్లులో అకౌంటెంట్ గా పనిచేస్తుంటాడు. భార్య (ఖుషి రవి), ఇద్దరు కూతుళ్లు సోఫి, తార, తల్లి సూరమ్మతో కలిసి ఓ గ్రామంలో అతిపురాతన ఇల్లు కొని నివాసం ఉంటాడు. ఆ ఇంటిలో చేరిన తర్వాత ఊహించని సంఘటనలు చోటు చేసుకోవడంతో గర్బిణిగా ఉన్న భార్య హాస్పిటల్‌లో చేరుతుంది. తల్లి ఊహించని రీతిలో ప్రమాదానికి గురి అవుతుంది.
ఆంథోని పురాతన ఇంటిని కొనుగోలు చేసి అక్కడే ఎందుకు ఉండాలని అనుకొన్నాడు?
పాత ఇంటిలో చేరిన తర్వాత పిల్లలకు, కుటుంబానికి ఎదురైన సమస్యలు ఏమిటి? ఇంటిలో జరిగిన సంఘటనలతో ఆంథోని ఎలా స్పందించాడు? ఆంథోని ఇంటిలోని క్షుద్ర శక్తులను అరికట్టేందుకు అన్నమ్మ (ఈశ్వరీరావు) ఏం చేసింది?ఆ ఇంటిలో అంతకు ముందు అసలు ఏం జరిగింది? ఆ ఇంటిని ఆంథోని వదిలేసి వెళ్లాడా? ఆ ఇంటిలో చిన్న కూతురికి ఆవహించిన ఆత్మను ఎలా వదిలించారు అనే ప్రశ్నలకు సమాధానమే పిండం సినిమా కథ.
రివ్యూ:
దర్శకుడు సాయికిరణ్ రాసుకొన్న స్టోరీ.. ఆ కథను చెప్పడానికి అల్లిన స్క్రీన్ ప్లే బాగుంది. ఈ కథకు ఆయన ఎంచుకున్న నటులు బాగా ప్లస్ అయ్యారు. ఫస్టాఫ్‌లో సినిమాను చాలా గ్రిప్పింగ్‌గా, ఎమోషనల్ చెప్పడమే కాకుండా నిజంగా కొన్ని సీన్లలో భయపెట్టే ప్రయత్నం చేశారు. సన్నివేశాల్లోని ఎమోషన్స్ పండించడానికి సినిమాటోగ్రఫి, మ్యూజిక్‌ను ఉపయోగించుకొన్న విధానం సినిమాకు మూడ్‌ను మరోస్థాయికి తీసుకెళ్లింది.
Ads
ఇక సెకండాఫ్ కూడా చాలా గ్రిప్టింగ్ గా ఉంటుంది. కానీ ప్రీ క్లైమాక్స్ నుంచి చివరి వరకు కథ రొటీన్‌గా అనిపించినా,ఫ్లాష్ బ్యాక్ చెప్పిన విధానం గుండెను పిండేసేలా చేస్తుంది. కథను ముగించడానికి రాసుకొన్న డ్రామా కూడా బాగా పడింది. ఓవరాల్‌గా చెప్పాలంటే పిండం మూమికి ట్యాగ్ లైన్ కు తగ్గట్టు ది స్కేరియస్ట్ మూవీ ఎవర్ అనే దానికి నిరూపించుకుంది.
నటీనటుల విషయానికి వస్తే.. ఇప్పటి వరకు గ్లామర్ హీరో, యాక్షన్ హీరోగా ఉన్న శ్రీరామ్ పిండం సినిమాలో చూస్తే ఢిఫరెంట్ లుక్, బాడీ లాగ్వేంజ్‌తో ఆకట్టుకొన్నారు. భావోద్వేగ సన్నివేశాల్లో ఆయన నటన బాగుంది. ఇక ఆంథోని భార్యగా నటించిన ఖుషి రవి తన పాత్రలో ఒదిగిపోయారు. ఇద్దరు చిన్నపిల్లల నటన బాగుంది. ఇక ఈశ్వరీ రావు తన క్యారెక్టర్ తో కథను తన భుజాలపై వేసుకొని ముందుకు నడిపించారు. అవసరాల శ్రీనివాస్ పాత్ర పరిధి తక్కువైనా గుర్తుండి పోతుంది. రవివర్మ రోల్ ఈ సినిమాకు కీలకం.
పిండం సినిమాకు సినిమాటోగ్రఫి, మ్యూజిక్ స్పెషల్ ఎట్రాక్షన్. పలు సన్నివేశాలను కృష్ణ సౌరబ్ సూరంపల్లి తన బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌తో ప్రాణం పోశారు. లైటింగ్, కలర్ ప్యాటర్న్‌తో సన్నివేశాల మూడ్‌ను సతీష్ మనోహర్ బాగా ఎలివేట్ చేయడమే కాకుండా సినిమాను రిచ్‌గా మార్చారు. ఆర్ట్ విభాగం పనితీరు బాగుంది. నిర్మాణ విలువలు కూడా సినిమాకి తగ్గట్టుగా ఉన్నాయి.
ప్లస్ పాయింట్స్:
- స్క్రీన్ ప్లే
- నటీనటుల పెర్ఫార్మెన్స్
- భయపెట్టించే సన్నివేశాలు
- మ్యూజిక్ & సినిమాటోగ్రఫీ
మైనస్ పాయింట్స్:
- రొటీన్ క్లైమాక్స్
- పాత కథ
రేటింగ్:
2.75/5
ఫైనల్ గా:
ఫ్యామిలీ ఎమోషన్స్ హర్రర్ ఎలిమెంట్స్ ఇష్టపడే వారికి ఈ సినిమా బాగా కనెక్ట్ అవుతుంది. మంచి థియేట్రికల్ ఎక్స్పీరియన్స్
watch trailer :