Ads
ఐపీఎల్ 2024 సీజన్ లో ముంబై ఇండియన్స్ తమ టీం కెప్టెన్ గా రోహిత్ శర్మను తప్పించింది. ఈ మేరకు ప్రకటన చేసి రోహిత్ ఫ్యాన్స్ కి షాక్ ఇచ్చింది.
ఇప్పటికే గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాను క్యాష్ ట్రేడింగ్ ద్వారా జట్టులోకి తెచ్చుకున్న ముంబై ఇండియన్స్ తాజాగా టీం కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించింది. ఐదు సార్లు ఛాంపియన్‌గా నిలబెట్టిన రోహిత్ శర్మ కెప్టెన్సీపై వేటు వేసి హార్దిక్ పాండ్యాను నూతన సారథిగా ప్రకటించింది.
హార్దిక్ పాండ్యాను ముంబై ఇండియన్స్ భవిష్యత్తు కోసమే తీసుకున్నారని, టీం సారథ్య బాధ్యతలను అతనికే ఇస్తారని అభిమానులతో పాటు క్రికెట్ విశ్లేషకులు ముందే పసిగట్టారు. కానీ ఈ మార్పు ఇంత త్వరగా ఉంటుందని ఎవరు ఊహించలేకపోయారు. కనీసం అప్‌కమింగ్ సీజన్‌లోనైనా రోహిత్ శర్మ జట్టును నడిపిస్తాడని భావించారు. కానీ ముంబై ఇండియన్స్ సారథిగా రోహిత్ శర్మను తొలగిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. దాంతో ముంబై ఇండియన్స్‌లో ఓ శకం ముగిసింది.
Ads
భవిష్యత్తును దృష్టిలో పెట్టుకునే ఈ నిర్ణయం తీసుకున్నామని ముంబై ఇండియన్స్ గ్లోబల్ హెడ్ మహేళా జయవర్దనే తెలిపాడు. కెప్టెన్సీ మార్పు కూడా అందులో భాగమే అని అన్నారు. రోహిత్ శర్మతో పాటు గతంలో సచిన్ టెండూల్కర్, హర్భజన్ సింగ్, రికీ పాంటింగ్‌లు ముంబై ఇండియన్స్‌ను అద్భుతంగా నడిపించడంతో పాటు ముందు చూపుతోనూ వ్యవహరించారు. వచ్చే సీజన్ నుంచి హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ చేపడతాడు. రోహిత్ అనుభవాన్ని మేం మైదానంలో ఉపయోగించుకుంటాం అని ప్రకటించారు