2024 లో టాలీవుడ్ లో అడుగు పెట్టబోతున్న హీరోయిన్స్ వీరే..! లిస్ట్ లో ఎవరెవరు ఉన్నారంటే..?

Ads

వచ్చే ఏడాదిలో రిలీజ్ అవ్వబోయే చాలా సినిమాలలో హీరోయిన్లు కొత్త వారే. తెలుగులో వారి అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి వేరే భాషల నుంచి వస్తున్న ఈ ముద్దుగుమ్మలు ఏ ఏ సినిమాల ద్వారా ఎంట్రీ ఇస్తున్నారో చూద్దాం.

వచ్చే ఏడాది మాస్ మహారాజా రవితేజ సినిమా మిస్టర్ బచ్చన్ రిలీజ్ అవ్వబోతుంది ప్రస్తుతం ఆ సినిమా షూటింగ్ జరుగుతుంది ఇందులో హీరోయిన్ గా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్న నటి భాగ్యశ్రీ బొర్సే.

heroines who are making debut in tollywood

ఈమె మంచి మోడల్ అలాగే యారియన్ 2 సినిమాతో బాలీవుడ్ ని కూడా మెప్పించింది ఈ భామ. అలాగే వరుణ్ తేజ్ తో కలిసి జతకట్టబోతున్న మరో న్యూ ఎంట్రీ మనుషి చిల్లర్. ఆపరేషన్ వాలెంటైన్ సినిమా ద్వారా టాలీవుడ్లో అదృష్టాన్ని వెతుక్కోబోతుంది ఈ అమ్మడు. స్పెషల్ సాంగ్స్ లో ఇన్నాళ్లు తెలుగు వాళ్ళని ఆలోచించిన నోరా ఫతేహి హరిహర వీరమల్లు సినిమాలో పవన్ కళ్యాణ్ తో పాటు నటించారు.

Ads

అయితే ఆ సినిమా ఎప్పుడు విడుదలవుతుందో తెలియదు 2024 లో రిలీజ్ అయితే మాత్రం ఈమె కూడా మిగిలిన నాయకులకి గట్టి పోటీని ఇవ్వవచ్చు. ఇక ఆషిక రంగనాథ్ 2023 లోనే ఎంట్రీ ఇచ్చినప్పటికీ హిట్ అందుకోలేకపోయారు కానీ మరొక అవకాశం ఉంది 2024 లో నాగార్జున సరసన నా సామిరంగా సినిమాతో రాబోతుంది. ఈమెకి ఇది సెకండ్ ఎంట్రీ అని చెప్పవచ్చు.

janhvi kapoor has given this rule for the movie

ఇక లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అన్నట్టు ఇప్పుడు మనం చెప్పుకోబోయేది జాన్వి కపూర్ గురించి. మిగిలిన వాళ్ళు అందరికన్నా ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ తో జూనియర్ ఎన్టీఆర్ సరసన దేవర సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తుంది ఈ అతిలోకసుందరి తనయ. శ్రీదేవి కూతురు కావడంతో ఈమెపై అంచనాలు కూడా అధికంగానే ఉన్నాయి. చూడాలి మరి ఎంతమంది టాలీవుడ్ ప్రేక్షకుల మనసులో గెలుచుకుంటారో.

Previous article“ఇది డెడికేషన్ కాదు..!” అంటూ… “శ్రీలీల” పై కామెంట్స్..! ఏం జరిగిందంటే..?
Next articleఎన్నికల్లో సీనియర్ ఎన్టీఆర్ ని ఓడించిన వ్యక్తి ఇప్పుడు ఎలా ఉన్నారో తెలుసా…?
Hi, This is Harika. I have been working as a web content writer in PRATHIDVANI from the past one year and am experienced in writing articles in cinema, sports, inspiring stories and flash news categories.