Ads
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.యస్.జగన్మోహనరెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రాష్ట్రవిభజన తరువాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రెండవ ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అయిన వై.యస్.రాజశేఖరరెడ్డి కుమారుడు. ఆయనను జగన్ అని కూడా పిలుస్తారు. వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపకుడు అయిన వై.ఎస్ జగన్ అరుదైన ఫోటోలను ఇప్పుడు చూద్దాం.. ముఖ్యమంత్రి వై.యస్.జగన్మోహనరెడ్డి పూర్తి పేరు యేదుగురి సందింటి జగన్మోహనరెడ్డి. 1972లో డిసెంబరు 21న జన్మించారు. రాజకీయనాయకుడు, వ్యాపారవేత్త, ఆంధ్రప్రదేశ్ రెండవ ముఖ్యమంత్రి. తన తండ్రి 2009 లో హెలీకాప్టర్ ప్రమాదంలో కన్నుమూసిన తరువాత ఓదార్పు యాత్రను చేపట్టాడు. ఆ తరువాత కాంగ్రెసు పార్టీతో విభేదాల రావడంతో ఆ పార్టీకి రిజైన్ చేసి, వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీని స్థాపించాడు.
2014 ఏపీ అసెంబ్లీ ఎన్నికలలో 67 స్థానాల గెలిచి, ప్రతిపక్ష నాయకునిగా ఉన్నాడు. ఆ తరువాత రాష్ట్ర వ్యాప్తంగా సుదీర్ఘమైన పాదయాత్ర చేసి, 2019 ఏపీ అసెంబ్లీ ఎన్నికలలో 151 స్థానాలలో గెలిచి, ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. సోషల్ మీడియాలో షికారు చేస్తున్న ముఖ్యమంత్రి వై.యస్.జగన్మోహనరెడ్డి అరుదైన ఫోటోలను మీరు కూడా చూడండి..
Ads
#1
#2#3#4#5#6#7#8#9#10#11#12#13#14#15#16#17