దూత సిరీస్ కి హైలైట్ అయిన ఈ హీరోయిన్ ఎవరో తెలుసా..? ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే..?

Ads

స్టార్ హీరోలు సినిమాలు కరోనా టైంలో డైరెక్ట్ ఓటిటిలో రిలీజ్ అయ్యాయి కానీ డిజిటల్ ప్లాట్ ఫామ్ లో నేరుగా మన తెలుగు హీరోలు నటించలేదు. అయితే అక్కినేని నాగచైతన్య తొలిసారిగా ఒక వెబ్ సిరీస్ తో ఓటిటి ఎంట్రీ ఇచ్చాడు.

దూత పేరుతో దీన్ని వెబ్ సిరీస్ గా తీశారు. ఈ సిరీస్ ఎంతగా హిట్ అయింది అంటే ఈ మధ్యకాలంలో వచ్చిన తెలుగు వెబ్ సిరీస్ లలో ప్రత్యేకమైన స్థానంలో కనిపిస్తుంది.

dhootha review

జర్నలిస్ట్ గా ఉండే హీరోకి కొందరి చావు ముందే తెలియటం వారిని రక్షించాలి అనుకునే లోపు వాళ్లు చనిపోవడం ఇదంతా చూస్తుంటే థ్రిల్లింగ్ అనిపిస్తుంది. ఈ సిరీస్ ఇంత హిట్ అవ్వటానికి కారణం దర్శకుడు విక్రమ్ కుమార్ కథను అల్లిన తీరు కథనాన్ని నడిపించిన విధానం. అలాగే ఈ సిరీస్ కి మరొక ప్లస్ పాయింట్ నటి పార్వతి తిరుమోతు ఈ సిరీస్ లో ఈమె డిసిపి క్రాంతి గా కనిపిస్తుంది వరుస హత్యలకు సంబంధించి ఇన్విస్టిగేటివ్ ఆఫీసర్ గా ఆమె రంగంలోకి దిగుతుంది.

Ads

dhootha review

ఎదుటి వాళ్ళని కళ్ళతో చూస్తూనే చదివేసే పాత్రకి ఏమి జీవం పోసింది. విశాలమైన ఈమె కళ్ళు ఆమెకి ప్లస్ అంటూ ఆమె ఫ్యాన్స్ కితాబు ని ఇస్తున్నారు. ఎంతో ధైర్యం, హుందాతనం కలిగిన ఒక డేరింగ్ పోలీస్ ఆఫీసర్ పాత్రని ఈమె చాలా బాగా పోషించిందని చెప్పాలి. ఈ సిరీస్ చూసిన వాళ్లంతా ఆమె నటన హైలెట్ అంటూ తెగ మెచ్చుకుంటున్నారు.

heroine in dhootha series

పార్వతి తిరుమోతు మలయాళం లో నటిగా తన ప్రయాణాన్ని మొదలుపెట్టి తర్వాత తమిళ సినిమాల్లో కూడా రంగ ప్రవేశం చేసింది ఇప్పుడు కన్నడలో కూడా నటిస్తోంది. ఉత్తమ నటిగా అనేక అవార్డులు సైతం అందుకుంది. ఇక దూత చూసిన తెలుగు డైరెక్టర్లు ఎవరైనా ఆమె నటనకు ఫిదా అయిపోవాల్సిందే అలా అయితే మనం త్వరలోనే ఈమెను తెలుగు వెండితెర మీద కూడా చూసే అవకాశాలు లేకపోలేదు

Previous articleవేణు స్వామి చెప్పింది మొదటి సారి తప్పు అయ్యిందా..? ప్రభాస్ విషయంలో ఏం అన్నారంటే..?
Next articleమీరు బాధపడొద్దు… మమ్మల్ని బాధ పెట్టొద్దు… “గుప్పెడంత మనసు” సీరియల్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్..! విషయం ఏంటంటే..?
Hi, This is Harika. I have been working as a web content writer in PRATHIDVANI from the past one year and am experienced in writing articles in cinema, sports, inspiring stories and flash news categories.