Ads
రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి సినిమా తర్వాత పాన్ ఇండియా స్థాయిలో ఒక రేంజ్ లో స్టార్ డమ్ ని సంపాదించుకున్నాడు.
ఒకప్పుడు దేశంలోనే అత్యధిక పారితోషకం తీసుకున్న షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్, రజనీకాంత్ లను దాటేసి అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకుంటున్న హీరోగా ప్రభాస్ చరిత్ర సృష్టించాడు.
ఇక సలార్ సినిమా కోసం ప్రభాస్ ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నాడో అని తెలిస్తే దిమ్మతిరిగి పోవాల్సిందే. ఈ సినిమా కోసం ప్రభాస్ ఏకంగా 100 కోట్లు తీసుకుంటున్నట్టు సమాచారం. దాంతో పాటు బాక్సాఫీస్ లాభాల్లో 10% అదనంగా తీసుకుంటున్నట్లు తెలిసింది. దీంతో రెండు పార్ట్ లు గా వచ్చే సలార్ సినిమా ఒక్కొక్క పార్ట్ 1000 కోట్లు వసూలు చేస్తే ఇండియన్ సినిమా చరిత్రలో అత్యధిక రెమ్యూనరేషన్ ప్రభాస్ నిలవబోతున్నాడు.
Ads
అలాగే హీరోయిన్ గా నటించిన శృతిహాసన్ 8 కోట్లు వసూలు చేసినట్లు సమాచారం, అలాగే మరొక నటుడు పృధ్వీరాజ్ సుకుమారన్ నాలుగు కోట్లు, మరొక ముఖ్యపాత్రను పోషించిన నటుడు జగపతిబాబు నాలుగు కోట్లు వసూలు చేసినట్లు సమాచారం. ఇక ఈ సినిమాకి దర్శకుడు అయినా ప్రశాంత్ నీల్ 50 కోట్ల పారితోషకం అందుకున్నట్లు సమాచారం. హోం బాలే ఫిలిమ్స్ నిర్మించిన కే జి ఎఫ్ చాప్టర్ 2 చిత్రం ప్రపంచవ్యాప్తంగా వేల కోట్ల రూపాయల వసూళ్లు రాబట్టింది.
మరి అదే సంస్థలో వస్తున్న సినిమా కూడా అదే రేంజ్ లో దూసుకుపోవటం ఖాయం అంటున్నారు ప్రభాస్ అభిమానులు. ఈ సినిమా క్లైమాక్స్ ని దర్శకుడు వేరే లెవెల్ లో ప్లాన్ చేశాడు.400 మంది ఫైటర్లతో సలార్ క్లైమాక్స్ ని ప్లాన్ చేశారని సమాచారం. ప్రశాంత్ నీల్,ప్రభాస్ కాంబినేషన్ క్రేజీ కాంబినేషన్ మూవీకి సీక్వెల్ గా సలార్ టు తెరకెక్కుతుందనే విషయం అందరికీ తెలిసిందే