అర్థం కాలేదా..? “సలార్” సినిమాపై గీతూ రాయల్ రివ్యూ చూసారా..? ఏం అన్నారంటే..?

Ads

డిసెంబర్ 22న ప్రభాస్ నటిస్తున్న సలార్ సినిమా విడుదల అయింది. అయితే ఎప్పుడెప్పుడు ప్రభాస్ కంబ్యాక్ ఇస్తాడా అని ఆశగా ఎదురు చూస్తున్న ప్రభాస్ అభిమానులందరికీ మంచి వార్త వచ్చింది అని చెప్పాలి.

ఎందుకంటే బెనిఫిట్ షోలు మొదలైనప్పుడు నుంచి యునానిమస్ గా బ్లాక్ బస్టర్ టాక్ రావడంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఆకలి ఇన్నాళ్లకు తీరింది. ప్రభాస్ ని ఎలాగైతే చూడాలనుకుంటున్నారో అదే విధంగా సలార్ సినిమాలో ప్రశాంత్ నీల్ చూపించారు.

బాహుబలి హిట్ అయిన తర్వాత ప్రభాస్ రేంజ్ వరల్డ్ వైడ్ గా చేరింది. కాని ఆ సినిమా తర్వాత వరుసగా మూడు ఫ్లాప్ లు రావడంతో ప్రభాస్ ఫ్యాన్స్ డిసప్పాయింట్ అవుతూనే వచ్చారు. ఇది నీ రేంజ్ సినిమా కాదన్నా అంటూ ఆదిపురుష్ వరకు బాధపడుతున్న ప్రభాస్ ఫ్యాన్స్ అందరూ సలార్ మీద ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని అది రీచ్ అవడంతో ప్రభాస్ అభిమానుల ఆనందానికి అడ్డే లేదు.

geetu royal about salaar

అయితే సినిమా విడుదలైనప్పుడు నుంచి ప్రతి ఒక్కరూ ప్రభాస్ ని పొగుడుతూ ఆ కటౌట్ గురించి రివ్యూలు ఇస్తూ బ్లాక్ బస్టర్ టాక్ ని తెచ్చారు.కానీ ఈ బిగ్ బాస్ భామ గలాటా గీతూ మాత్రం సినిమా ముందు ఫ్లాప్ అవుతుంది అనుకునే వెళ్ళాను నాకు మాత్రం అలాగే అనిపించింది. కథ అయితే బాగుంది కాని అందులో ఉన్న ట్విస్టులు, ఎడిటింగ్, డైలాగులు నాకు ఏమీ అర్థం కాలేదబ్బా. ఎవడు ఏం మాట్లాడుతున్నాడో కూడా నాకు అర్థం కాలేదు. మొదటిసారి చూసిన ఎవరికీ సినిమా అర్థం కాకపోవచ్చు.

minus points in salaar trailer

లేకపోతే నాదే అంత తక్కువ బ్రెయిన్ ఏమో నాకైతే అర్థం కాలేదు. కానీ రెండోసారి చూస్తే మీకు అర్థం అవ్వచ్చు. ఇది పక్కన పెడితే సినిమా కథ బాగుంది. అన్నిటికన్నా మించి ప్రభాస్ అన్న కట్ అవుట్ అయితే ఓ మై గాడ్ దీని కోసమే కదా ఇన్ని సంవత్సరాలు ఎదురు చూసింది అన్నట్టుగా ఉంది అని రివ్యూ ఇచ్చింది. అయితే దీని గురించి ప్రభాస్ అభిమానులు ఫైర్ అవుతూ ఆ సినిమా అర్థం కాకపోవడం సినిమా తప్పు కాదు బుర్ర లేని నీ తప్పు అంటూ కామెంట్లు పెడుతున్నారు.

Watch video:

 

Previous article“ప్రభాస్” తో పాటు… “సలార్” నటీనటుల రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..?
Next article“ఇది డెడికేషన్ కాదు..!” అంటూ… “శ్రీలీల” పై కామెంట్స్..! ఏం జరిగిందంటే..?
Hi, This is Harika. I have been working as a web content writer in PRATHIDVANI from the past one year and am experienced in writing articles in cinema, sports, inspiring stories and flash news categories.