Ads
ఎందుకంటే పక్కన ఒక స్టార్ ఉంటే వాళ్ళకి అదే ఇమేజ్ పడతాదో లేకపోతే ఎక్కడైనా ఎలివేషన్ తక్కువ ఉన్న సీన్లు వస్తాయేమో అని భయం. అలాగే ఈ సినిమాలో కూడా ప్రభాస్, పృధ్వీరాజ్ ఇద్దరు నటించారు కానీ తెలుగు వాళ్ళకి పృథ్వీరాజ్ ఎక్కువ పరిచయం లేకపోవడంతో మల్టీ స్టార్ లాగ్ చూడడం లేదు కానీ పృథ్వీరాజ్ కూడా మలయాళంలో ఒక పెద్ద స్టార్ హీరోనే.
అయితే పృథ్వీరాజ్ కోసం ఈ సినిమాలో ప్రభాస్ చప్పట్లు కొడతాడు, ఈల వేస్తాడు. ప్రభాస్ కనుక ఇలా చేశాడు అదే ఇంకే హీరో అయినా ఇలా మరొక హీరో కోసం చప్పట్లు కొడతారా? విజిల్ వేస్తారా? అనుకుంటూ వాళ్ళ ఫాన్స్ మరొక హీరోతో పోల్చడం మొదలుపెట్టారు.
Ads
ఆర్ఆర్ఆర్ సినిమా వలన రామ్ చరణ్ ఫ్యాన్స్, ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎన్ని గొడవలు మొదలుపెట్టారో ఇప్పటికీ అందరికీ గుర్తున్న విషయమే అయితే ఈసారి అలా కాకుండా ప్రభాస్ నే పొగుడుతూ వాళ్ళ ఫాన్స్ అందరు తెగ మురిసిపోతున్నారు.ఫస్ట్ హాఫ్ లో పట్టుమని పది డైలాగులు కూడా ఉండవు ప్రభాస్ కి. మీ హీరో ఇలా డైలాగ్ లు లేకుండా సినిమా తీస్తాడా కానీ మా హీరో తీయగలడు సైలెంట్ గా కంటి చూపుతో కూడా ఎక్స్ప్రెషన్స్ ని తెప్పించగలడు మా హీరో అను ప్రభాస్ ని పొగుడుకుంటూ ఉన్నారు.
ఇలా ప్రతి విషయం మీద ప్రభాస్ ని మిగిలిన హీరోలతో పోల్చుకుంటూ మీ హీరో అయితే ఇలా చేయలేరు మా ప్రభాస్ కనుక చేశారు అని చెప్పుకుంటూ మురిసిపోతున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ కి ఎక్కువ డైలాగులు ఉండవు ఫైటింగ్ ఎక్కువగా ఉంటుంది. వీలైతే కాళ్లు కూడా పట్టుకొనే క్యారెక్టర్ ప్రభాస్ ది. అంత పెద్ద స్టార్ అయినా సరే కాళ్లు పట్టుకోవడానికి ఎక్కడ సంకోచించలేదు అలా మీ హీరో కూడా చేయగలడా? అని మిగిలిన హీరో పేర్లన్నీ తెచ్చి వాళ్లతో పోల్చి సంబరపడిపోతున్నారు ప్రభాస్ ఫ్యాన్స్.