Ads
ఇప్పుడు సినీ ప్రపంచం మొత్తం సలార్ నామ జపం చేస్తుంది. ఇంకా చెప్పాలంటే ఆ సినిమా యొక్క తన్మయత్వంలో మునిగి తేలుతుంది. ప్రశాంత్ నీల్ చూపించిన ప్రపంచానికి సినీ క్రిటిక్స్ కూడా ఫిదా అయిపోతున్నారు. బాలీవుడ్ లో సైతం భారీ వసూళ్లను రాబట్టింది ఈ సినిమా. అయితే కన్నడలో మాత్రం సలార్ కి చుక్కెదురైందని చెప్పవచ్చు.
నిజానికి సినిమా రిలీజ్ అవ్వటానికి ముందు వరకు ఆ సినిమా మీద చాలా ఆశలు పెట్టుకున్నారు కన్నడిగులు. దానికి కారణం డైరెక్టర్ కన్నడిగుడు పైగా కేజిఎఫ్ వంటి సినిమా తీసి మంచి ఫామ్ లో ఉన్నాడు. అలాగే ప్రభాస్ కూడా బాహుబలితో అక్కడ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్నాడు. సినిమా రిలీజ్ అవ్వటానికి ముందు ప్రభాస్, ప్రశాంత్ నీల్ కటౌట్ లకి పాలాభిషేకాలు సైతం చేశారు కన్నడ ప్రేక్షకులు. అయితే సినిమా రిలీజ్ అయిన తర్వాత సీన్ మొత్తం మారిపోయింది.
Ads
ప్రశాంత్ నీల్ మొదటి సినిమా ఉగ్రం లాగే సలార్ కూడా ఉందనే రూమర్ రావడం ఇందుకు ఒక కారణం. ఉగ్రం కేవలం కన్నడలోనే రిలీజ్ అయింది కాబట్టి ఆ కథ గురించి పెద్దగా బయట వాళ్ళకి తెలియదు కానీ కన్నడ వాళ్ళు ఉగ్రం సినిమాని ఆల్రెడీ హిట్ చేశారు. అదే కధాంశంగా వచ్చిన సలార్ ని ఓన్ చేసుకోలేకపోయారు. అయితే సలార్ కి సినిమాకి ఉగ్రం సినిమాకి చాలా తేడాలు ఉన్నాయి, ఉగ్రం సినిమాలో చెప్పలేని చాలా విషయాలు సలార్ సినిమాలో చెప్పడానికి అవకాశం దొరికింది.
అంతేకానీ ఆ కధ ఈ కధ ఒకటి కాదు అంటూ సాక్షాత్తు సినిమా డైరెక్టర్ చెప్పినప్పటికీ లాభం లేక పోయింది. ఇంత నెగిటివిటీని మూట కట్టుకున్న సలార్ కన్నడలో పెద్దగా వసూళ్లు రాబట్టలేకపోయింది. దానికి తోడు అక్కడ ఆడియన్స్ ప్రశాంత్ నీల్ మీద చాలా కోపంగా ఉన్నారంట. ఇక్కడ ఫేమ్ సంపాదించుకొని ఇక్కడ హీరోలతో కాకుండా బయట హీరోలతో సినిమాలు చేయటం కన్నడ ప్రేక్షకులకి పెద్దగా నచ్చటం లేదు. దాంతో కన్నడలో సలార్ కి అనుకున్నంతగా కలెక్షన్లు రావటం లేదన్నది నిజం.