Ads
ప్రభాస్, ప్రభాస్, ప్రభాస్. ఇప్పుడు ఎవరి నోటి నుంచి విన్నా రామనామ జపం లాగా ఈ పేరే వినిపిస్తుంది. సినిమాల విషయానికి వస్తే సలార్ పేరు మాత్రమే వినిపిస్తుంది. చాలా సంవత్సరాల నుంచి హిట్ కోసం ఎదురుచూస్తున్న ప్రభాస్ కి సాలిడ్ హిట్ పడింది ఆకలి మీద ఉన్న అతని ఫ్యాన్స్ కి విందు భోజనం పెట్టినట్లుగా పెట్టాడు ప్రభాస్. ఇక ప్రభాస్ ఫ్యాన్స్ కి మిగిలిన కోరిక ఒకటే అతను పెళ్లి చేసుకుంటే చూడాలి.
వాళ్ల పెదనాన్న గారు కూడా అదే కోరిక కోరుకున్నారు. కానీ ఆయన ఆఖరి కోరిక తీరకుండానే వెళ్ళిపోయారు కృష్ణంరాజు గారు. అయితే కృష్ణంరాజు గారి భార్య శ్యామలాదేవి 2024లో కచ్చితంగా ప్రభాస్ పెళ్లి జరుగుతుంది అని ఆ మధ్య ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ప్రభాస్ పెళ్లి గురించి ఆయన అభిమానులు ఒక రేంజ్ లో ఎదురుచూస్తున్నారు. అదే సమయంలో సోషల్ మీడియాలో ఒక అమ్మాయి ఇంటర్వ్యూ తెగ వైరల్ అవుతుంది.
Ads
ప్రభాస్ మరదలు ఈమె అంటూ ఆమె ఇంటర్వ్యూలు సైతం తీసుకుంటున్నారు యూట్యూబర్స్. ఇంతకీ విషయం ఏమిటంటే ఆమె ప్రభాస్ పుట్టినరోజు నాడు తన ఫోన్ వాట్సాప్ స్టేటస్ లో హ్యాపీ బర్త్డే బావ అని పెట్టుకుంది. అయితే ఇంటర్వ్యూ చేసినప్పుడు యాంకర్ మీరు ప్రభాస్ కి మరదలేనా ఆయనకి మీరు బర్త్డే విషెస్ చెప్పారు కదా అని అడిగినప్పుడు. నేను ఆయనకి పుట్టినరోజు శుభాకాంక్షలు కేవలం నా ఫోన్ స్టేటస్ లో పెట్టుకున్నాను అంతేకానీ ఆయనకి విషెస్ చెప్పే అంత సినిమా లేదు అని చెప్పుకొచ్చింది.