Ads
టాలీవుడ్ లో మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా గుర్తింపు పొందిన రాజీవ్ కనకాల ,బుల్లితెరపై యాంకర్ గా పాపులర్ అయిన సుమా కనకాల.. కొడుకు రోషన్ కనకాల ఈరోజు తన మొదటి చిత్రం బబుల్ గమ్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. హై రొమాంటిక్ లవ్ స్టోరీ గా తెరకెక్కించిన ఈ చిత్రం ప్రేక్షకులను ఎంతవరకు మెప్పించిందో తెలుసుకుందాం పదండి..
మూవీ: బబుల్ గమ్
నటీనటులు: రోషన్ కనకాల, మానస చౌదరి, హర్షవర్ధన్, హర్ష చెముడు, కిరణ్ మచా, అనుహాసన్, చైతూ జొన్నలగడ్డ, బిందు చంద్రమౌళి, అనన్య ఆకుల
దర్శకత్వం: రవికాంత్ పేరేపు
స్క్రీన్ ప్లే: రవికాంత్ పేరుపు, వంశీకృష్ణ
నిర్మాతలు: పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, మహేశ్వరీ మూవీస్
సంగీతం: శ్రీచరణ్ పాకాల
రిలీజ్ డేట్: 2023-12-29
స్టోరీ:
బస్తీలో ఆనందంగా తన కలలో బతికే ఒక కుర్రవాడు..ఆదిత్య (రోషన్ కనకాల). ఎప్పటికైనా మంచి డీజే గా గుర్తింపు తెచ్చుకొని బాగా డబ్బులు సంపాదించాలి అని కలలు కంతుంటాడు ఆదిత్య. ఈ నేపథ్యంలో అనుకోకుండా ఒక రోజు ఫ్యాషన్ డిజైనర్ కోర్స్ చేయడం కోసం అమెరికా వెళ్లడానికి రెడీ అయిన జాన్వీ (మానస చౌదరి) ను కలుస్తాడు. మొదటి చూపులోనే ఆమెతో ప్రేమలో పడిపోయిన ఆదిత్య ఎలాగైనా ఆమెను తనవైపు అట్రాక్ట్ చేసుకోవడానికి ట్రై చేస్తాడు. జాన్వీకి అప్పటికే ఆమె బాయ్ ఫ్రెండ్ తో బ్రేకప్ అయి ఉంటుంది. అనుకోకుండా ఆదిత్య జాన్వీ కోసం వెళ్లి అవమానం పాలవుతాడు. ఇక అన్ని మర్చిపోయి తన కెరీర్ మీద కాన్సెంట్రేట్ చేయాలి అనుకునే సమయంలో సడన్గా జాన్వీ తిరిగి అతని లైఫ్ లోకి ఎంటర్ అవుతుంది.
జాన్వికి రిలేషన్స్ అంటే పెద్దగా పడవు.. అబ్బాయిలను మరీ ఆట బొమ్మల చూస్తుంది. మరి అలాంటి అమ్మాయి ఆదిత్యతో ఎలా లవ్ లో పడుతుంది? ఆ తర్వాత కథలో ఎలాంటి మలుపులు జరుగుతాయి? ఫైనల్ గా వీళ్ళ లవ్ స్టోరీ కి ఎలాంటి ఎండింగ్ ఎదురయింది? తెలుసుకోవాలంటే స్క్రీన్ పై మూవీ ని చూడండి.
విశ్లేషణ:
Ads
బబుల్‌గమ్ మూవీ స్టార్టింగ్ నుంచి ఎంతో యూత్ ఫుల్ ఎంటర్టైనింగ్ ఎలిమెంట్స్ తో నిండి ఉంటుంది. ఈ సినిమాలో ఎమోషనల్ సీన్స్ కంటే కూడా రొమాంటిక్ సీన్స్ ఎక్కువ అని చెప్పవచ్చు. మూవీ ఫస్ట్ హాఫ్ మొత్తం యూత్ కు క్రేజ్ ఎక్కించే హాట్ రొమాంటిక్ సీన్స్ ఉన్నాయి. కామెడీ ట్రై చేశారు కానీ అంతగా సెట్ అయితే అవ్వలేదు. కాస్త డైరెక్టర్ మూవీ లో రొమాన్స్ డోస్ తగ్గించి ఎమోషన్స్ కి స్టోరీ కి పెంచి ఉంటే కథ ఇంకా బాగుండేది అనిపిస్తుంది.
మొదటిసారి నటిస్తున్న రోషన్ ఏమాత్రం తగ్గకుండా రొమాంటిక్ సీన్స్ లో రెచ్చిపోయాడు. ఇక ఈ సినిమాలో అక్కడక్కడ తండ్రి కొడుకుల మధ్య జరిగే కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు, హీరోయిన్ ఫ్యామిలీకి సంబంధించిన కొన్ని సీన్స్ కాస్త మూవీ పై ఇంట్రెస్ట్ కలిగిస్తాయి. లవ్ స్టోరీ అయితే చాలా రొటీన్ గా ఉంది. ముందు ఏం జరుగుతుందో ఈజీగా గెస్ చేసే విధంగా అక్కడక్కడా కొన్ని సీన్స్ తెచ్చి అతికించినట్లు.. సాగదీసినట్లు.. మొత్తానికి సుమక్క స్టేజ్ షో లాగా కాస్త సరదాగా ,కాస్త సాగదీతగా ,కాస్త టెన్షన్ గా, కాస్త ఎమోషన్ గా ఈ సినిమా ఉంది.
మరీ ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ మూవీకి వెళ్తే మాత్రం కచ్చితంగా డిసప్పాయింట్ అవుతారు. టేకింగ్ పరంగా డైరెక్టర్ చాలా జాగ్రత్తగా తీసుకున్నప్పటికీ కథ మీద మరికొంత శ్రద్ధ పెట్టి ఉంటే బాగుండేది. ఆదిత్య పాత్రలో రోషన్ బాగా సెట్ అయ్యాడు. అయితే కాస్త అతను తన లుక్స్ మీద ధ్యాస పెట్టి ఉంటే బాగుండేది. మరోపక్క మానస చౌదరి ప్రేక్షకులకి మంచి రొమాంటిక్ ట్రీట్ అందించింది.
ప్లస్ పాయింట్స్:
- యూత్ ని ఆకర్షించే ఎలిమెంట్స్ ఈ చిత్రంలో బాగా ఉన్నాయి.
- రొమాంటిక్ సన్నివేశాలు ఆడియన్స్ కి మంచి ట్రీట్.
- క్లైమాక్స్ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది.
మైనస్ పాయింట్స్:
- బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మీద కాస్త కాన్సన్ట్రేట్ చేస్తే బాగుండేది.
- హీరో లుక్స్ అంతంతమాత్రంగా ఉన్నాయి.
- స్టోరీలో కొన్ని సీన్స్ అనవసరంగా తెచ్చి అతికించినట్లుగా ఉంది. అక్కడక్కడ బోరింగ్ గా సాగదీతగా ఉంది.
రేటింగ్ : 2.5 / 5
చివరి మాట:
చాలా రొటీన్ గా సాగే ఒక బోరింగ్ ప్రేమ కథ “బబుల్ గమ్“.
watch trailer: