ఓటీటీలో సంచలనం సృష్టిస్తున్న ఈ సినిమా చూసారా.? ఆమె చేతి వంటకి ఎందుకు భయపడుతున్నారు.?

Ads

ఇప్పటికే ఓటీటీ లో చాలా సినిమాలు ప్రేక్షకులను మెప్పిస్తున్నాయి. కొత్త సినిమాలు థియేటర్స్ లో రిలీజ్ అయిన నెల రోజులకే ఓటీటీ లో దర్శనం ఇచ్చేస్తున్నాయి. థియేటర్స్ లో సినిమాలను ఎంజాయ్ చేస్తున్నప్పటికీ ప్రేక్షకులు ఓటీటీ లో కూడా చూడటానికి ఆసక్తి చూపిస్తున్నారు. అందులోనూ క్రై-మ్ థ్రిల్లర్స్ ని చూడటానికి మరింత ఆసక్తి చూపిస్తున్నారు ఆడియన్స్.

అలాంటి ఒక రియల్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ ఒకటి ఇప్పుడు ఓటీటీ లోకి వచ్చింది. ఆ సినిమాయే కర్రీ అండ్ సై-నైడ్. నిజ జీవిత కథ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమాలో జూలీ జోసెఫ్ అనే మహిళ 14 ఏళ్లలో 6 హ-త్యలు చేసింది. అన్నింటినీ అనుమానాస్పద మృతులుగా కట్టుకథలు అల్లింది. జూలీ జోసెఫ్ తన అత్తయ్యను,మామయ్యను ఆ తరువాత ఆమె భర్త రాయ్ థామస్ ను, ఆ తర్వాత తన భర్తకి మేనమామ అయిన మ్యాథ్యూ ని..

Ads

తన భర్తకి దగ్గర బంధువు అయిన షాజు జచారయ్య భార్యను, ఆమె ఏడాదిన్నర బిడ్డను చంపేసింది. ఆ తరువాత షాజు జచారయ్యను రెండో వివాహం చేసుకుంది. ఇంత మందిని చంపినా పోలీసులకు అనుమానం రాకుండా హ్యాండిల్ చేయగలిగింది ఈ కిలాడీ లేడీ. అయితే జూలీ మరిది అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు దాంతో అసలు విషయాలు బయటపడ్డాయి.

ఆస్తి తనకి దక్కాలన్న అత్యాశతోనే అందరిని చంపిన జూలీని పోలీసులు అరెస్టు చేశారు. జూలీ తో పాటు ఆమెకు సై-నేడ్ సరఫరా చేసిన మరో ఇద్దరు నిందితులు ఎంఎస్ మాథ్యూ, ప్రాజి కుమార్ లను కూడా పోలీసులు అరెస్ట్ చేసారు. ఈ సంఘటనల ఆధారంగా తెరకెక్కింది ఈ కర్రీ ఎండ్ సైనైడ్. ఈ క్రైమ్ థ్రిల్లర్ ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్ లో తెలుగు, తమిళం, మలయాళం, హిందీ, కన్నడ, ఇంగ్లీష్ భాషల్లో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతుంది.

Previous articleFind “W”: మీ కంటి చూపు పదునుగా ఉందా…?అయితే ఇందులో W ఎక్కడుందో కనిపెట్టండి.. !
Next articleరతన్ టాటా వారసులు వీరే.. ఈ ముగ్గురు గురించి ఈ విషయాలు తెలుసా.?
Hi, This is Harika. I have been working as a web content writer in PRATHIDVANI from the past one year and am experienced in writing articles in cinema, sports, inspiring stories and flash news categories.