న్యూ ఇయర్ కి అందరు హీరోయిన్స్ పబ్ లకి వెళ్తే…”సాయి పల్లవి” మాత్రం ఏం చేసారో తెలుసా.?

Ads

హీరోయిన్ సాయి పల్లవి గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. తన అద్భుతమైన నటనతో అందరినీ ఆకట్టుకుంటుంది. సాయి పల్లవి చేసే ప్రతి పాత్ర ఎంతో ప్రత్యేకంగా ఉంటుంది. పాత్రికి ప్రాధాన్యత ప్రత్యేకత లేకపోతే సాయి పల్లవి ఆ సినిమా చేయరు. సాయి పల్లవి ఒక సినిమా ఒప్పుకుంటుంటే ఆ సినిమాలో ఏదో విషయం ఉందని అర్థం. ఎటువంటి అసభ్యతకి చోటు లేకుండా ఎంతో ప్రత్యేకమైన పాత్రలు చేస్తూ వస్తుంది.

ఏదైనా సినిమా ఒప్పుకునే ముందు ఆ పాత్ర ఆ కథ తనకు నచ్చితేనే ఆమె చేస్తారు. ఇప్పటివరకు ఆమె చేసిన సినిమాలన్నీటిలోనూ ఆమె నటనకు మంచి మార్కులే పడ్డాయి. కొన్ని కొన్ని సినిమాలు ఆమె నటనతోనే ప్రత్యేకత సంపాదించుకున్నాయంటే ఆశ్చర్యమేమీ లేదు. అలాగే డ్యాన్సర్ గా సాయి పల్లవిని మించిన వారు లేరు. ఆమె పక్కన డాన్స్ చేయాలంటే ఎటువంటి స్టార్ హీరో కైనా సరే ఇబ్బంది.
ఆమె బాడీలో స్ప్రింగ్ లో ఉన్నాయా అని అనిపించక మానదు.

Ads

అయితే తాజాగా సాయి పల్లవి చేసిన ఒక పని వల్ల ఆమె అందరి మన్ననలు పొందుతున్నారు.
ఇంతకీ ఆమె ఏం చేసిందంటే..! తాజాగా అందరూ రెండువేల 24 నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొన్నారు. ఎవరికి తగ్గట్టు వారు పార్టీలు, పబ్బులు, షికార్లు అంటూ న్యూ ఇయర్ వేడుకలను జరుపుకున్నారు. ఇక అందరికీ భిన్నంగా సాయి పల్లవి కూడా న్యూ ఇయర్ వేడుకలు జరుపుకున్నారు. అయితే ఇక్కడే ఆమె ప్రత్యేకత కనిపించింది. పబ్ లకి పార్టీలకి వెళ్లకుండా పుట్టపర్తి సాయిబాబా గుడికి వెళ్లి కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. రోజంతా సాయిబాబా ధ్యానంలో ఉన్నారు. సాంప్రదాయంగా చీర కట్టుకుని ప్రత్యేకమైన రోజులను ట్రెడిషనల్ వేలో నిర్వహించుకోవడం పట్ల సాయి పల్లవిని ఫ్యాన్స్, నెటిజన్లు అభినందిస్తున్నారు.

ఒక సాయి పల్లవి ప్రస్తుతం తెలుగులో నాగచైతన్య సరసన తండేల్ మూవీలో నటిస్తున్నారు. ఈ మూవీకి చందు మొండేటి డైరెక్షన్ చేస్తున్నారు.ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ జరుపుకుంటుంది. ఈ మూవీని ప్రముఖ నిర్మాణ సంస్థ గీత ఆర్ట్స్ నిర్మిస్తుంది. దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు.

Previous articleఇలాంటి కాన్సెప్ట్ మీద కూడా సినిమా తీస్తారా? ఓటీటీ లోకి వచ్చిన ఈ సినిమా చూశారా?
Next articleVENKY RE-RELEASE: రీ రిలీజ్ లో రికార్డు సృష్టించిన రవితేజ వెంకీ….కలెక్షన్స్ ఎంత అంటే…?
Hi, This is Harika. I have been working as a web content writer in PRATHIDVANI from the past one year and am experienced in writing articles in cinema, sports, inspiring stories and flash news categories.