Ads
ఎంతో మంది అభ్యర్థులు యూపీఎస్సీ పరీక్షలలో ఉత్తీర్ణత సాధించి, ఐఏఎస్ ఆఫీసర్ కావాలని కలలు కంటున్నారు. దానిలో కోసం ఎన్నో కష్టపడుతారు. అలా కష్టాలన్నీ దాటుకుని, ఓ యువతి తను కలలు కన్న లక్ష్యాన్ని చేరుకుంది.
Ads
ఆ యువతి తన తల్లిదండ్రుల సహయంతో ఎంతో శ్రమించి, సహనంతో అనారోగ్యాన్ని దాటుకుని, ఎన్ని ఆటంకాలు వచ్చినా తను అనుకున్న లక్ష్యాన్ని సాధించింది. యూపీఎస్సీ రాసిన మొదటిసారే టాపర్ గా నిలిచిన ఆ యువతి ఎవరో? ఆమె సక్సెస్ స్టోరీ ఇప్పుడు చూద్దాం..
ఢిల్లీకి చెందిన సౌమ్య శర్మ 2017లో తొలిసారి యూపీఎస్సీ రాసి, తొమ్మిదో ర్యాంకు సాధించి అగ్రస్థానంలో నిలిచింది. ఆమె తన ప్రాధమిక విద్యాభ్యాసం ఢిల్లీలో చేసింది. నేషనల్ లా స్కూల్ నుండి సౌమ్య లా డిగ్రీని పొందింది. ఆమె లా ఆఖరి సంవత్సరంలో ఉన్న సమయంలో ఆమె యూపీఎస్సీ పరీక్ష రాసి, ఐఏఎస్ కావాలని నిర్ణయించుకుంది. ఐఏఎస్ ఆఫీసర్ గా అవడానికి ఆమె తన ప్రయాణంలో ఎన్ని అడ్డంకులు వచ్చిన తన లక్ష్యాన్ని వదలలేదు.
16 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు సౌమ్య వినికిడి శక్తి 90% కోల్పోయింది. చిన్నతనం నుంచి చదువులో తెలివిగా, చురుగ్గా ఉండేది. ఆమె టెన్త్ లో టాపర్ గా నిలిచింది. యూపీఎస్సీకి చాలా మంది కోచింగ్ కు వెళ్తుంటారు. కానీ సోమ్య శర్మ యూపీఎస్సీ కోసం ఏ కోచింగ్ ఇన్స్టిట్యూట్లో చేరకూడదని సొంతంగా ప్రిపేర్ అయ్యింది. వినికిడి లోపంతో బాధపడుతున్నప్పటికీ, ఆమె ఎలాంటి రాయితీలపై ఆధారపడకుండా జనరల్ కేటగిరీ కింద దరఖాస్తు చేసింది.
పరీక్ష కోసం వివిధ టెస్ట్ సిరీస్‌ల పై ఆధారపడింది. అలా ఆమె ప్రిలిమినరీ పరీక్షలో క్వాలిఫై అయ్యింది. దాంతో సోమ్యకు తన ప్రిపరేషన్ ను కొనసాగించింది. సాధారణ పరిజ్ఞానంలో ఆమెకు ఉన్న బలమైన పునాదితో పాటు ప్రశ్నలను త్వరగా గ్రహించి, విశ్లేషించే సామర్థ్యం ఆమె విజయాన్ని సులభతరం చేసింది. చరిత్ర మరియు భౌగోళిక శాస్త్రం వంటి సబ్జెక్టులు, సాధారణ పరిజ్ఞానం పై ఆమెకు ఉన్న పట్టు ప్రత్యేకించి, ఆమె పనితీరుకు చాలా ఉపయోగపడింది.
మెయిన్స్ కు వారం రోజుల ముందు సోమ్య తీవ్ర జ్వరంతో అనారోగ్యానికి గురైంది. ఆమె అనారోగ్యంతో ఉన్నప్పటికీ, జ్వరం 102-103 డిగ్రీల మధ్య ఉన్నా దృఢ నిశ్చయంతో పరీక్షకు హాజరు అయ్యింది. పరీక్ష హాలులో బ్రేక్ సమయంలో కూడా సోమ్య రోజుకు మూడుసార్లు సెలైన్ డ్రిప్స్ చేయించుకుంది. 23 ఏళ్ల వయస్సులో 2017 యూపీఎస్సీ పరీక్షలో దేశవ్యాప్తంగా 9వ ర్యాంక్ సాధించిన సోమ్యా శర్మ అసాధారణమైన ఫీట్‌ను సాధించింది. ఆమె అంకితభావం మరియు పట్టుదల, పోటీ పరీక్షలే లక్ష్యంగా ఉన్న అభ్యర్థులకు ప్రేరణగా నిలుస్తాయి. ప్రస్తుతం సౌమ్య శర్మ సమర్థ ఐఏఎస్ అధికారిగా దేశానికి సేవలందిస్తున్నారు.
సౌమ్య శర్మ మాట్లాడుతూ మా తల్లిదండ్రుల వలె డాక్టర్ కావాలనుకున్నాను. కాని, ‘లా’ లో జాయిన్ అయ్యాను. లా పూర్తయ్యే టైమ్ లో యూపీఎస్సీ రాయాలని భావించాను. అలా యూపీఎస్సీ కోసం ప్రిపరేషన్ మొదలుపెట్టాను. అందుకు పేరెంట్స్ సహకరించారు. ఈ పరీక్ష కోసం 4 నెలల పాటు శ్రమించి చదివాను. దీనిని మామూలు పరీక్షగానే అనుకున్నాను. నా దృష్టిలో ఏ ఎగ్జామ్ కు అయిన పట్టుదల, శ్రమ, సరైన ప్రణాళిక ఉండాలని నమ్ముతాను. నేను అదే పాటించను అని చెప్పుకొచ్చారు.
Also Read: రతన్ టాటా వారసులు వీరే.. ఈ ముగ్గురు గురించి ఈ విషయాలు తెలుసా.?