TAMANNA : 8 ఏళ్ల క్రితమే పూర్తైన సినిమా…ఇప్పుడు థియేటర్ లో కాకుండా నేరుగా ఓటీటీలోకి.! ఎందుకంటే.?

Ads

బాలీవుడ్ లో కంగనా రౌనత్ ప్రధాన పాత్ర పోషించిన క్వీన్ మూవీ ఎంత ఎంత సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. అదే సినిమాని ఆధారంగా చేసుకొని తెలుగులో మిల్క్ బ్యూటీ తమన్నా ని హీరోయిన్ గా పెట్టి దట్ ఇస్ మహాలక్ష్మి సినిమాగా చిత్రీకరించారు దర్శకుడు ప్రశాంత్ వర్మ. ఈ సినిమా తీస్తున్నట్టు 2014లో ప్రకటించారు. మూవీ షూటింగ్ మాత్రం 2016లో పూర్తయింది. అయితే సౌత్ రీమేక్ రైట్స్ విషయంలో నెలకొన్న వివాదం కారణంగా ఈ చిత్రం అప్పుడు రిలీజ్ కాలేదు.

కారణాలైతే తెలియదు గాని ఇప్పటికీ ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని ఎనిమిది సంవత్సరాలు అయింది. ఇప్పటికీ ఈ సినిమా విడుదలకి నోచుకోకపోవడం విశేషం. అయితే ఇప్పుడు సినిమాకు సంబంధించిన సమస్యలన్నీ తీరిపోయాయో ఏమో కానీ మేకర్స్ సినిమా రిలీజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు.సినిమా షూటింగ్ పూర్తయి ఇప్పటికే 8 ఏళ్లు పూర్తి కావడంతో థియేటర్లో సినిమా రిలీజ్ చేస్తే ప్రేక్షకులు ఆదరించరేమో అనే భావనలో మేకర్స్ ఉన్నట్లు తెలుస్తుంది.

Ads

అందుకే నెట్ ఫ్లిక్స్ యాజమాన్యంతో నిర్మాతలు చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. మేకర్స్ అనుమానం నిజమే, ఇప్పటికే ఈ సినిమా ఒకటి ఉందని జనాలు చాలా వరకు మర్చిపోయారు. రాబోయే పండగకి ఇప్పటికే చాలా సినిమాలు పోటీ పడుతున్నాయి. ఆ పోటీలో దట్ ఇస్ మహాలక్ష్మి విడుదల చేయటానికి కనీసం థియేటర్లు దొరుకుతాయి అనే నమ్మకం కూడా లేదు. కాబట్టి నిర్మాతలు ఓటీటీలో సినిమాని విడుదల చేయడమే మంచిది.

సినిమా నిర్మాతలు ఓటీటీ యాజమాన్యం ఒప్పందం కుదిరితే సినిమా ఓటీటీలో ఎప్పుడు స్ట్రీమింగ్ అవుతుంది అనే విషయంపై క్లారిటీ వస్తుంది. ఈ సినిమాలో డీజే టిల్లు ఫేమ్ సిద్దు జొన్నలగడ్డ కీలక పాత్ర పోషించాడు. అయితే ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతుంది అని గతంలో కూడా వార్తలు వినిపించాయి. ఇప్పుడు కూడా మూవీ మేకర్స్ అధికారికంగా ఎలాంటి సమాచారం విడుదల చేయకపోవడం గమనార్హం.

Previous articleబాలరాముడి విగ్రహాన్ని చెక్కిన శిల్పి ఎవరో తెలుసా..?
Next article90s Web series Review: శివాజీ నటించిన “90’స్. ఏ మిడిల్ క్లాస్ బ‌యోపిక్” వెబ్ సిరీస్ ఎలా ఉంది..? స్టోరీ, రివ్యూ & రేటింగ్!
Hi, This is Harika. I have been working as a web content writer in PRATHIDVANI from the past one year and am experienced in writing articles in cinema, sports, inspiring stories and flash news categories.