Ads
ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో కొంతమంది యువ నాయకులు తమ సత్తా చాటారు. వారిలో ఒకరు మామిడాల యశస్విని రెడ్డి. రాష్ట్రంలోని పాలకుర్తి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున తొలిసారిగా యశస్విని రెడ్డి పోటీ చేసింది. ఏ మాత్రం రాజకీయ అనుభవం లేకపోయినా 30 ఏళ్ల సుదీర్ఘ అనుభవం ఉన్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పై ఘన విజయాన్ని సాధించింది.
ఈ క్రమంలో ఈమె ఎవరు అంటూ ఆమె వ్యక్తిగత వివరాలు తెలుసుకోవటానికి చాలామంది ఆసక్తి చూపిస్తున్నారు. యశస్విని రెడ్డి 1997 సంవత్సరంలో హైదరాబాదులో జన్మించారు. ఆమె తల్లిదండ్రులు తిరుపతిరెడ్డి మాధవి. ఆమెకి ఒక చెల్లెలు కూడా ఉంది. ఈమె టెన్త్ వరకు ఎల్బీనగర్ శ్రీ చైతన్య స్కూల్లోనూ 2018 హైదరాబాదులోని శ్రేయస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి బీటెక్ ని పూర్తి చేశారు. 2019 సంవత్సరంలో ఝాన్సీ రెడ్డి, రాజేందర్ రెడ్డిల కుమారుడు రాజా రామ్మోహన్ రెడ్డి తో వివాహం జరిగింది.
Ads
ఈ వివాహంలో రాజా రామ్మోహన్ రెడ్డి, యశస్విని ఇద్దరూ ప్రభాస్, అనుష్క లా డాన్స్ చేశారు అప్పట్లో ఇది చాలా వైరల్ అయింది. అయితే యశస్విని రెడ్డి రాజకీయ ప్రవేశం అనుకోకుండా జరిగింది నిజానికి యశస్విని అత్త అయినటువంటి ఝాన్సీ రెడ్డికి వచ్చిన టికెట్టు పౌరసత్వం విషయంలో చిక్కులు రావటంతో టికెట్టు కోడలు యశస్విని రెడ్డికి దక్కడం జరిగింది. కాగా యశస్విని రెడ్డి భర్త కుటుంబానికి అమెరికాలో రియల్ ఎస్టేట్ వ్యాపారం వుంది.
వివాహం అనంతరం ఆమె కూడా అమెరికాకు వెళ్లి అక్కడ వ్యాపార బాధ్యతలని చూసుకుంది. ఝాన్సీ రెడ్డి వ్యాపారంలో బాగా సంపాదించిన తరువాత సొంత ఊరికి ఎంతో కొంత మేలు చేయాలని ఇక్కడ సేవా కార్యక్రమాలు చేసేవారు. తర్వాత పూర్తిస్థాయిలో ప్రజలకు సేవ చేయాలని రాజకీయాలలో అడుగు పెట్టడం జరిగింది. రాజకీయాలలో అడుగుపెడుతూనే ఘనవిజయం సాధించారు యశస్విని.